Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మహేష్ బాబును పెళ్లి చేసుకోవాలంటున్న విలన్ సంపత్ కుమార్తె

విలన్‌గా దూసుకెళుతున్న సంపత్ రాజ్ కుమార్ నటించిన చిత్రాలలో ''పంజా'', ''దమ్ము'' చిత్రాల తర్వాత ''మిర్చి'' అతనికి మంచి గుర్తింపు తెచ్చింది. ఈ చిత్రంలో ప్రభాస్ శత్రువు కుటుంబానికి చెందిన సంపత్ నటన పరంగా

Advertiesment
Villain
, గురువారం, 13 అక్టోబరు 2016 (10:25 IST)
విలన్‌గా దూసుకెళుతున్న సంపత్ రాజ్ కుమార్ నటించిన చిత్రాలలో ''పంజా'', ''దమ్ము'' చిత్రాల తర్వాత ''మిర్చి'' అతనికి మంచి గుర్తింపు తెచ్చింది. ఈ చిత్రంలో ప్రభాస్ శత్రువు కుటుంబానికి చెందిన సంపత్ నటన పరంగా విజృంభించాడు. దాంతో తెలుగులో మోస్ట్ వాంటెడ్ విలన్ అయిపోయాడు. ఈ హీరో ''పవర్'', ''లౌక్యం'', ''సన్నాఫ్ సత్యమూర్తి'' తదితర చిత్రాల్లో నటించాడు.

ఈ హీరోకున్న డిమాండ్ చూసి తెలుగు దర్శక, నిర్మాతలు సంపత్ ఇంటి ముందు క్యూ కడుతున్నారు. 'శ్రీమంతుడు' సినిమాలో నటించి మంచి పేరును సంపాదించుకున్నాడు సంపత్. తన నటనతో దక్షిణాదిలో అన్ని భాషల్లోనూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ హీరో శ్రీమంతుడు సినిమాలో జరిగిన ఓ సంఘటనను గుర్తుచేసుకున్నారు. 
 
''శ్రీమంతుడు'' సినిమాలో కొరటాల శివ చెప్పినట్టే నటించాను. తెరపైన చూస్తే సినిమా ఒక రేంజ్‌లో వచ్చింది. నా కెరియర్లో శ్రీమంతుడి సినిమాను ఎప్పటికీ మర్చిపోలేను. మహేష్‌ చాలా ప్రొఫెషనల్‌ నటుడు. తనతో పోటీగా నటించే వారుంటే ఎంతో సంతోషిస్తారు. ఈ సినిమా అందువల్లే మంచి విజయం సాధించింది. ''శ్రీమంతుడు'' షూటింగ్‌ సమయంలో ఆయన సెట్స్‌లో వేసే పంచ్‌లకు పడిపడి నవ్వుకునేవాళ్లం. ''శ్రీమంతుడు''ని మా అమ్మాయి తమిళంలో చూసి బ్యాంకాక్‌లో ఉన్న నాకు ఫోన్‌ చేసింది. 
 
తనకిపుడు పదహారేళ్లు... మహేష్‌ తనకు బాగా నచ్చారట. ''ఆయనతో పెళ్లి చేస్తావా''అని అడిగింది. నేను నవ్వు ఆపుకోలేకపోయాను. సినిమాలో మహేష్‌ని కొట్టినందుకు నాపైన కోప్పడింది కూడా. ''యూ ఆర్‌ బ్యాడ్‌'' అంది. అది సినిమా అని చెప్పినా ''మహేష్‌ని ఎవరూ కొట్టకూడదంతే'' అంది కోపంగా. మహేష్‌ అభిమానుల్లో 80 శాతం అమ్మాయిలే ఉంటారనుకుంటా అని సంపత్ అన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నేను లెక్కల్లో పూర్... ఇంట్లోని వ్యవహారాలన్నీ ఆమె చక్కబెడుతుంది : బాలకృష్ణ