హిట్ కొట్టాక రెమ్యునరేషన్ పెంచమంటారు.. కానీ నేను అడగనంటున్న హీరో!
రాత్రికి రాత్రే క్రేజ్ సంపాదించుకున్న హీరో విజయ్ దేవరకొండ. సురేష్‌ప్రొడక్షన్‌లో వేషం కోసం ప్రయత్నించినా మొదట్లో దక్కలేదు. ఆ తర్వాత అదే సురేష్ ప్రొడక్షన్ విడుదల చేసిన 'పెళ్లి చూపులు' సినిమాతో భారీ
రాత్రికి రాత్రే క్రేజ్ సంపాదించుకున్న హీరో విజయ్ దేవరకొండ. సురేష్‌ప్రొడక్షన్‌లో వేషం కోసం ప్రయత్నించినా మొదట్లో దక్కలేదు. ఆ తర్వాత అదే సురేష్ ప్రొడక్షన్ విడుదల చేసిన 'పెళ్లి చూపులు' సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. రాత్రికి రాత్రే హిట్ హీరో అయిపోయాడు. అంతకుముందు 'ఎవడే సుబ్రమణ్యం' సినిమాతో ఆకట్టుకున్న ఈ హీరో ఇప్పుడు 'ద్వారక'తో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ చిత్రంతో విజయ్ తన పారితోషికాన్ని భారీగానే పెంచేశాడనే ప్రచారం జరుగుతోంది. దీనిపై ఆయన వివరిస్తూ... సాధారణంగా ఒక భారీ హిట్ పడిన తర్వాత రెమ్యునరేషన్ పెంచడం జరుగుతూ ఉంటుందనీ, కానీ ప్రస్తుతం తనకి అలాంటి ఆలోచన లేదని అన్నాడు. తాను ఇంతవరకూ ఏ నిర్మాతను అడగలేదని విజయ్ చెప్పాడు.