Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భారతీయ చీరలంటే అమితమైన ఇష్టం... విద్యాబాలన్

విద్యాబాలన్ మెల్లగా టాపు లేపుతోంది. చీరలో ఎద ఒంపులను ప్రదర్శిస్తూ కెమేరాకు ఫోజిచ్చింది. సహజంగా పెళ్లయిన తర్వాత నటీమణులు నటనకు స్వస్తి చెప్పకపోయినా ఎక్స్‌పోజింగ్ క్యారెక్టర్లు చేయరు. కానీ బాలీవుడ్ సెక్

భారతీయ చీరలంటే అమితమైన ఇష్టం... విద్యాబాలన్
, గురువారం, 15 సెప్టెంబరు 2016 (10:40 IST)
విద్యాబాలన్ మెల్లగా టాపు లేపుతోంది. చీరలో ఎద ఒంపులను ప్రదర్శిస్తూ కెమేరాకు ఫోజిచ్చింది. సహజంగా పెళ్లయిన తర్వాత నటీమణులు నటనకు స్వస్తి చెప్పకపోయినా ఎక్స్‌పోజింగ్ క్యారెక్టర్లు చేయరు. కానీ బాలీవుడ్ సెక్సీ నటి విద్యాబాలన్ మాత్రం తన అలవాటును ఎంతమాత్రం మార్చుకోలేదు. 
 
ఇటీవలి ఫోటోసెషన్ ఇమ్మని అడిగితే చీర కట్టుకుని ఉన్న విద్యాబాలన్ తన ఎద ఒంపులను కనబడేట్లు ఎడాపెడా ఫోజులిచ్చేసింది. నిజానికి మహిళల ప్రాధాన్యం ఉన్న చిత్రాల్లో నటించే కథానాయికల్లో విద్యాబాలన్‌ ముందుంటుంది. అందుకే ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం మహిళలకు అందచేసే పింఛను పథకానికి విద్యాబాలన్‌ను ప్రచాకర్తగా నియమించింది. 
 
ఇటీవలే కేంద్ర పట్టు పరిశ్రమ శాఖ కూడా పట్టు బోర్డుకు విద్యాబాలన్‌నే ప్రచారకర్తగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సంప్రదాయ వస్త్రాలతో అందరిని కైపెకిస్తూ.. కట్టూ, బొట్టుతో ఆకట్టుకోవడం విద్యాబాలన్ ప్రత్యేకత. ''నాకు పట్టు చీరలంటే ఎంత ఇష్టమో. ఎవరింట్లో శుభకార్యానికి పిలిచినా ఓ కొత్త పట్టు చీర కొనుక్కుని మరీ కట్టుకుంటా. 
 
ఇప్పుడు మన దేశ చీరల ఖ్యాతిని మరింతగా పెంచే బృహత్కార్యంలో నన్ను భాగస్వామిని చేయడం సంతోషంగా ఉందంటోన్న విద్యాబాలన్‌ ఇప్పటికే ప్రభుత్వం తరపున ఎన్నో సేవా కార్యక్రమాల్లో భాగస్వామిగా ముందుకు దూసుకుపోతోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పిల్లలు పుట్టినా.. చిత్ర పరిశ్రమను వదిలిపెట్టను : అనుష్క