Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బన్నీని అక్కడా వెంటాడనున్న వరుణ్ తేజ్.. మలయాళంలో ఫిదా డబ్బింగ్..?

టాలీవుడ్ నుంచి మలయాళంలో మంచి ప్రాచుర్యం పొందిన బన్నీకి సరైన పోటీ ఎదురవనుందా.. శేఖర్ కమ్ముల, దిల్ రాజు తీసిన ఫిదా సినిమా మండువేసవిలో మలయమారుతంలా తెలుగు రాష్ట్రాల ప్రజలను చల్లగా పలకరించింది. తెలంగాణ ప్ర

Advertiesment
బన్నీని అక్కడా వెంటాడనున్న వరుణ్ తేజ్.. మలయాళంలో ఫిదా డబ్బింగ్..?
హైదరాబాద్ , బుధవారం, 26 జులై 2017 (07:21 IST)
టాలీవుడ్ నుంచి మలయాళంలో మంచి ప్రాచుర్యం పొందిన బన్నీకి సరైన పోటీ ఎదురవనుందా.. శేఖర్ కమ్ముల, దిల్ రాజు తీసిన ఫిదా సినిమా మండువేసవిలో మలయమారుతంలా తెలుగు రాష్ట్రాల ప్రజలను చల్లగా పలకరించింది. తెలంగాణ ప్రజలు ఆ సినిమాలో  తమ భాషకు, సంస్కృతికి ఇచ్చిన గౌరవం చూసి ఫిదా అయిపోతున్నారు. ఇప్పుడు తాజాగా అందిన వార్త ఏమిటంటే ఫిదా మలయాలీ చిత్రపరిశ్రమను కూడా తాకనుందని సమాచారం. 
 
మలయాళంలో ప్రేమమ్ సినిమా ద్వారా సాయి పల్లవి ఒక చరిత్రనే లిఖించుకుంది. కేరళ యువతలో ప్రేమ భావనకు కొత్త అర్థం చెప్పిన ప్రేమమ్ సినిమాలో మలర్ పాత్ర ద్వారా కేరళీయులను మంత్రముగ్దులను చేసింది. ఇప్పుడు తెలుగులో తన తొలి సినిమా ఫిదా ద్వారా తెలుగు ప్రజల హృదయాల్లో నిలిచిపోయే స్థాయిలో భానుమతి పాత్రకు జీవం పోసింది. 
 
ఫిదా సినిమా అంటే ఇప్పుడు జనాలకు మంచి సినిమా గుర్తురావడం కన్నా, సాయి పల్లవి గుర్తుకు రావడమే కీలకం. సాయి పల్లవి తెలుగువాళ్లని ఇప్పుడు ఆకట్టుకుంది కానీ, మళయాలీలను ఎప్పుడో ఫిదా చేసింది. ప్రేమమ్ లో మలార్ గా ఆమె అక్కడ యువ ప్రేక్షకుల హృదయాల్లో ఎప్పుడో కోలువు తీరింది.
 
ఇప్పుడు ఫిదా సినిమా టాక్, ట్రయిలర్లు చూసి, మళయాల సినిమా రంగం జనాలు ఆ సినిమాను తమ భాషలోకి డబ్ చేసి అందించమని అప్పుడే అడగడం ప్రారంభించేసారట. అయితే ఇక్కడ చిన్న టెక్నికల్ ప్రాబ్లమ్ వుందని తెలుస్తోంది. డబ్బింగ్ సినిమాలు, వాటి సెన్సార్ లకు సంబంధించి, ఇటీవల కేరళలో ఏవో కొన్ని చేంజెస్ వచ్చినట్లు వినికిడి. అందువల్ల ఆ వ్యవహారాలు పరిశీలిస్తున్నారట. ఏ మాత్రం అవకాశం వున్నా త్వరలోనే మళయాల ప్రేక్షకులను కూడా దిల్ రాజు ఫిదా చేస్తారట.
 
మొత్తం మీద మలయాళంలోకి ఫిదా వెళితే బన్నీకి, వరుణ్ తేజ్‌కి పోటీ మొదలయినట్లే మరి. మల్లువుడ్‌లో బన్నీకి ఒక రేంజిలో పేరుంది. వరుణ్ తేజ్ తన ఫిదా మలయాళీ వెర్షన్ ద్వారా బన్నీతో పరభాషలోనూ పోటీ పడనున్నాడా. వేచి చూడాలి.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నిండా మునగబోయిన దిల్ రాజు.. ఫిదాతో బతికిపోయాడు.. 5 రోజుల్లోపే లాభాల బాట