Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎక్కడ తగ్గాలో త్రివిక్రమ్‌కి బాగా తెలుసు, అందుకే.. అలా ప్లాన్ చేసాడా..?

Advertiesment
Trivikram srinivas shocking decesion
, సోమవారం, 29 జూన్ 2020 (23:30 IST)
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.. ఇటీవల అల.. వైకుంఠపురములో సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసాడు. ఈ సినిమా తర్వాత ఎవరితో సినిమా చేస్తాడా అనుకుంటే... యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో త్రివిక్రమ్ సినిమా ఎనౌన్స్ చేయడం తెలిసిందే. సమ్మర్లో ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లాలి అనుకున్నారు కానీ.. కరోనా కారణంగా ఆగింది.
 
ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ఇప్పుడు చెప్పలేని పరిస్థితి. అయితే... ఎన్టీఆర్‌తో సినిమా చేయడం బాగా ఆలస్యం అయ్యే అవకాశం ఉండడంతో వేరే హీరోతో సినిమా ప్లాన్ చేస్తున్నాడు త్రివిక్రమ్ అంటూ వార్తలు వచ్చాయి.
 
ఇప్పుడు త్రివిక్రమ్ గురించి మరో వార్త బయటకు వచ్చింది. అది ఏంటంటే... కరోనా కారణంగా చిత్ర పరిశ్రమకు బాగా దెబ్బ. ప్రజలు ఇప్పుడు సినిమా చూసే మూడ్లో లేరు. అందువలన సినిమా నిర్మాణ వ్యయం బాగా తగ్గించాలి. అందుకని త్రివిక్రమ్ తన రెమ్యూనరేషన్ బాగా తగ్గించుకునేందుకు ముందుకు వచ్చినట్టు సమాచారం.
 
త్రివిక్రమ్‌తో పాటు ఎన్టీఆర్ కూడా రెమ్యూనరేషన్ తగ్గించుకునేందుకు ఓకే చెప్పినట్టు టాలీవుడ్ టాక్. ఎన్టీఆర్ ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి.
 
 ఈ సెన్సేషనల్ మూవీకి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందిస్తున్నారు. ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కలిసి అరవింద సమేత సినిమాతో సక్సస్ సాధించారు. ఈ సినిమాతో కూడా మరో విజయం సాధిస్తారని అభిమానులు గట్టి నమ్మకంతో ఉన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వనితా విజయ్ కుమార్ భర్తకు మొదటి భార్య సెగ?