అల వైకుంఠపురం, అరవింద సమేత సినిమాలతో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ పూజాహెగ్డేను కొత్తగా చూపించే ప్రయత్నం చేశారు. అందం కన్నా అభినయాన్ని ఎక్కువగా చూపించే ప్రయత్నమే ఆయన చేశారు. అందులో సక్సెస్ అవ్వగలిగారు.
మాటల మాంత్రికుడితో చేసిన సినిమాలన్నీ పూజాకు మంచి పేరే తెచ్చిపెట్టాయి. అయితే పూజా మాత్రం త్రివిక్రమ్‌తో మరో సినిమా చేసేందుకు ఉత్సాహం చూపిస్తోందట. ప్రస్తుతం లాక్‌డౌన్ కొనసాగుతోంది కాబట్టి షూటింగ్‌కు పర్మిషన్ వచ్చిన వెంటనే తన కోసం ఓ లైన్ ఆలోచన చేయమని చెపుతోందట పూజా.
ఖచ్చితంగా కథను సిద్థం చేస్తానని, అందులో నీ క్యారెక్టర్‌కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చేలా చూస్తానని హామీ ఇచ్చారట త్రివిక్రమ్. అంతేకాదు ఫోన్ కట్ చేస్తున్న సమయంలో లక్కీ పూజా అంటూ పిలిచారట. ఎందుకు సర్ అలా పిలుస్తారని అడిగితే.. నువ్వు నిజంగా లక్కీ అంటూ చెప్పి పెట్టేశారట త్రివిక్రమ్.