హైదరాబాద్ డ్రగ్స్ కేసులో టాలీవుడ్ హీరో సోదరుడు!
హైదరాబాద్ డ్రగ్స్ రాకెట్ వ్యవహారం కాస్త తెలుగు సినీపరిశ్రమలను ఒక కుదుపు కుదిపేస్తోంది. ఇప్పటికే 8 మంది పేర్లు బయటకురాగా మరికొంతమంది పేర్లను వెల్లడించేందుకు ఎక్సైజ్ శాఖ, పోలీసులు సిద్ధంగా ఉన్నారు. అందు
హైదరాబాద్ డ్రగ్స్ రాకెట్ వ్యవహారం కాస్త తెలుగు సినీపరిశ్రమలను ఒక కుదుపు కుదిపేస్తోంది. ఇప్పటికే 8 మంది పేర్లు బయటకురాగా మరికొంతమంది పేర్లను వెల్లడించేందుకు ఎక్సైజ్ శాఖ, పోలీసులు సిద్ధంగా ఉన్నారు. అందులో ఒక హాట్ యాంకర్, మరో సెక్సీ హీరోయిన్ ఉన్న విషయం తెలిసిందే. అయితే వీరి కన్నా మరో ప్రధాన నటుడి సోదరుడు ఉన్న విషయం బయటకు రావడంతో తీవ్ర చర్చకు దారితీస్తోంది. అందులోనూ ప్రముఖ నిర్మాత కుమారుడు కావడం గమనార్హం.
విచారణలో కెల్విన్ సేవ్ చేస్తున్న ఫోన్ నెంబర్లలో ఆ హీరో సోదరుడి పేరు కూడా ఉంది. ఇంకేముంది ఇక మిగిలింది ఆయన్ను విచారించడమే. అయితే అతనికి పోలీసులు మాత్రం ఇప్పటివరకు నోటీసులు పంపించలేదు. బడా నిర్మాత కొడుకు కావడంతో పోలీసులు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. పైగా, అతని పేరును వెల్లడిస్తే మాత్రం సినీ పరిశ్రమ ఓ షాక్‌కు గురయ్యే అవకాశం ఉంది.