అమలా పాల్ అఫైర్ ఎవరితోనో తెలుసా?
దర్శకుడు విజయ్‌ని ప్రేమించి వివాహం చేసుకుని.. ఆపై సినీ కెరీర్ కోసం అతని నుంచి దూరమైన అమలాపాల్ ప్రస్తుతం సినీ అవకాశాలతో దూసుకెళ్తోంది. తాజాగా తిరుట్టు పయలె సెకండ్ పార్ట్‌లో అమలా పాల్ నటిస్తోంది. సుసీ
దర్శకుడు విజయ్‌ని ప్రేమించి వివాహం చేసుకుని.. ఆపై సినీ కెరీర్ కోసం అతని నుంచి దూరమైన అమలాపాల్ ప్రస్తుతం సినీ అవకాశాలతో దూసుకెళ్తోంది. తాజాగా తిరుట్టు పయలె సెకండ్ పార్ట్‌లో అమలా పాల్ నటిస్తోంది. సుసీ గణేశన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రసన్న, బాబీ సింహా, వివేక్ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమా టీజర్ శుక్రవారం అమలా పాల్ చేతుల మీదుగా సాయంత్రం రిలీజైంది.
ఈ ట్రైలర్‌ను చూస్తే అమలా పాల్‌కు ప్రసన్నాకు ఏదో అఫైర్ ఉన్నట్లు నడుస్తోంది. దాన్ని టెక్నాలజీ సాయంతో బాబి సింహా ఫోన్ ట్రాక్ చేసి వింటాడు. ఆపై వీరిద్దరి వద్ద డబ్బులు గుంజుతాడు. ఈ ట్రాక్‌లో నడిచే ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో బాబీ సింహా అమలా పాల్ భర్తగా నటిస్తాడని తెలుస్తోంది.