Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

డ్రగ్స్ కేసులో ప్రముఖ నిర్మాత తనయుడు.. హీరో... ఉచ్చుబిగిస్తున్న ఎక్సైజ్ శాఖ

హైదరాబాద్‌లో వెలుగు చూసిన డ్రగ్స్ కేసులో ప్రముఖ నిర్మాత కుటుంబానికి చెందిన హీరో మెడ చుట్టూత ఉచ్చు బిగుస్తోంది. మత్తు మందు వ్యవహారంలో గతంలో ఈ హీరో పేరు వెలుగులోకి వచ్చినప్పటికీ.. అపుడు సరైన సాక్ష్యాధార

Advertiesment
డ్రగ్స్ కేసులో ప్రముఖ నిర్మాత తనయుడు.. హీరో... ఉచ్చుబిగిస్తున్న ఎక్సైజ్ శాఖ
, ఆదివారం, 23 జులై 2017 (09:47 IST)
హైదరాబాద్‌లో వెలుగు చూసిన డ్రగ్స్ కేసులో ప్రముఖ నిర్మాత కుటుంబానికి చెందిన హీరో మెడ చుట్టూత ఉచ్చు బిగుస్తోంది. మత్తు మందు వ్యవహారంలో గతంలో ఈ హీరో పేరు వెలుగులోకి వచ్చినప్పటికీ.. అపుడు సరైన సాక్ష్యాధారాలు లేక పోవడంతో అపుడు తప్పించుకున్నాడు. కానీ ఇపుడు ఆ పరిస్థితి లేదు. డ్రగ్స్ కేసులో ప్రస్తుతం అతని చుట్టూ ఉచ్చు బిగుస్తోంది.
 
గతంలో హైదరాబాద్‌ పశ్చిమ మండలంలో మత్తుమందుల ముఠాను పట్టుకున్నప్పుడు అతని పేరు వచ్చింది. అయితే, నాడు కేసుల దర్యాఫ్తు ముందుకు సాగేందుకు అవసరమైన సాక్ష్యాలు లభించకపోవడంతో అప్పట్లో బతికిపోయాడని తెలుస్తోంది. ఇక తాజాగా కెల్విన్ నుంచి పూరీ జగన్నాథ్, సుబ్బరాజు, తరుణ్‌ల విచారణ తరువాత అతని పేరే ప్రముఖంగా వినిపిస్తోంది. 
 
తొలి జాబితాలో నోటీసులు పొందిన వారి విచారణ ఆగస్టు 2 వరకూ సాగనుండగా, ఆపై రెండో దఫా విచారణను ఎదుర్కొనే వారిలో ఇతనే అత్యంత కీలకమైన వ్యక్తిగా సిట్ అధికారులు భావిస్తున్నారు. అతనితో పాటు ఈ కేసులో బయటకు వచ్చిన, యూత్‌లో క్రేజున్న మరో హీరోకూ వచ్చే వారం నోటీసులు జారీ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇంతకీ ఈ హీరో చిత్ర పరిశ్రమ రికార్డులను తిరగరాసిన తెలుగు చిత్రంలో నటించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అది నచ్చితేనే షాట్ ఓకే అంటుందట తమన్నా