కోవిడ్ ప్రతికూల పరిస్థితుల వల్ల సినిమా షూటింగ్‌లు, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లోనూ కొత్త పోకడలను దర్శక నిర్మాతలు వెతుక్కుంటున్నారు. అందులోనూ వందల కోట్లు పెట్టి తీస్తున్న ప్రభాస్ సినిమా `ఆదిపురుష్`కు అడుగడుగునా కొన్ని అడ్డంకులు తలెత్తిన విషయం తెలిసిందే. షూటింగ్‌లో వుండగా సెట్ కాలిపోవడం కూడా అప్పట్లో జరిగింది.
పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాను దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కిస్తున్నారు. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ రామునిగా నటిస్తుండగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనోన్ సీత పాత్రలో నటిస్తుంది. రావణ పాత్రలో సైఫ్ అలీఖాన్ నటిస్తుండగా సన్నీ సింగ్ లక్ష్మణ పాత్రలో నటిస్తున్నారు.
కాగా, ఈ సినిమా టెక్నాలజీ కొద్దిగా మార్చనున్నట్లు బాలీవుడ్ వర్గాలు తెలియజేస్తున్నాయి. ఓంరౌత్ తన చిత్రం “తనాజీ” తరహాలోనే 3డి టెక్నాలిజీనే ఈ సినిమాకు కూడా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. దీనివల్ల ఔట్‌పుట్ బాగా వస్తుందని, పెట్టిన పెట్టుబడికి గిట్టుబాటు అవుతుందని దర్శక నిర్మాతల ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీనివల్ల విజువల్‌పరంగా నేత్రానందంగా వుంటుందని టాక్ వినిపిస్తోంది. ఏదిఏమైనా కోవిడ్ సినిమాలోనూ మార్పు తెచ్చిందన్నమాట.