Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రభుదేవా ఇపుడు తమన్నాను పట్టేశాడట... అలా జరిగిపోతోందంటూ...

కోలీవుడ్ పాపులర్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా గురించి, ఆయనపై వచ్చిన రూమర్లు గురించి వేరే చెప్పక్కర్లేదు. తొలుత నగ్మాతో ఎఫైర్ వెలగబెట్టాడంటూ వార్తలు వచ్చాయి. ఆ తర్వాత నగ్మాతో అలాంటిదేమీ లేదని చెపుతుండగానే సిమ్రాన్ అంటూ మరో వార్త వచ్చింది. ఈ వార్తలో కూడా వా

Advertiesment
tamannah acts with prabhudeva again
, బుధవారం, 19 ఏప్రియల్ 2017 (14:54 IST)
కోలీవుడ్ పాపులర్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా గురించి, ఆయనపై వచ్చిన రూమర్లు గురించి వేరే చెప్పక్కర్లేదు. తొలుత నగ్మాతో ఎఫైర్ వెలగబెట్టాడంటూ వార్తలు వచ్చాయి. ఆ తర్వాత నగ్మాతో అలాంటిదేమీ లేదని చెపుతుండగానే సిమ్రాన్ అంటూ మరో వార్త వచ్చింది. ఈ వార్తలో కూడా వాస్తవం లేదని అంటుండగానే నయనతారతో కలిసి తిరగడం మొదలుపెట్టాడు. అలా తిరుగుతూనే పెళ్లి చేసుకుందాం అనుకునేలోపుగా వ్యవహారం బెడిసికొట్టింది. ఏదో విషయం దగ్గర తేడా వచ్చి ఇద్దరూ విడిపోయారు. ఆ తర్వాత ప్రభుదేవా కొన్నాళ్లు గడ్డాలు పెంచుకుని తిరిగాడు. 
 
ఇపుడు మళ్లీ ఏవో ఆశలు చిగురిస్తున్నాయంట. అభినేత్రి చిత్రంలో తమన్నాను తన సరసన నటింపజేసుకున్న ప్రభుదేవా మరో చిత్రంలో ఆమెను బుక్ చేశారని కోలీవుడ్ సినీ ఇండస్ట్రీ వర్గాల సమాచారం. అంతేకాదు... తమన్నాను పెళ్లి చేసుకోవాలని ప్రభుదేవా కలలు కంటున్నారంటూ కోలీవుడ్ సినీజనం చెప్పుకుంటున్నారు. మరి దీనిపై తమన్నా రెస్పాన్స్ ఎలా వుంటుందో చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మన రేంజ్‌కు కాజల్ - రకుల్ సరిపోరు.. సమంత అయితే సమ్మగా ఉంటుంది.. అలీ కామెంట్స్