Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Tamannaah: విరాట్ కోహ్లీ, అబ్ధుల్ రజాక్‌లతో అలాంటి రూమర్స్.. తమన్నా ఫైర్

Advertiesment
Tamannah_Kohli_Razzack

సెల్వి

, సోమవారం, 4 ఆగస్టు 2025 (21:48 IST)
Tamannah_Kohli_Razzack
మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా పాన్-ఇండియన్ స్టార్‌గా ఎదిగిపోయింది. విజయ్ వర్మతో బ్రేకప్ తర్వాత ఆమెపై పలు రూమర్లు వస్తున్నాయి. తాజాగా క్రికెటర్లు అబ్దుల్ రజాక్, విరాట్ కోహ్లీలతో ఆమె ప్రేమాయణం నడిపిందని పుకార్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వార్తలపై తమన్నా స్పందించింది. 
 
పాకిస్తాన్ క్రికెటర్ అబ్దుల్ రజాక్‌తో కలిసి ఒక ఆభరణాల దుకాణం ప్రారంభోత్సవంలో తాను కనిపించడం పూర్తిగా ప్రొఫెషనల్ అని తమన్నా ఇటీవల స్పష్టం చేసింది. మీడియా ఈ సంఘటనను తప్పుడు వివాహ కథగా మార్చిందని, అది తనకు ఇబ్బందికరంగా, అసంబద్ధంగా అనిపించిందని ఆమె వెల్లడించింది. రజాక్‌కు ఇద్దరు లేదా ముగ్గురు పిల్లలు ఉన్నారని స్పష్టం చేసింది. 
 
అలాగే విరాట్ కోహ్లీతో ప్రేమాయణానికి సంబంధించిన వార్తలను కూడా తమన్నా కొట్టి పారేసింది. ఒక వాణిజ్య ప్రకటన షూటింగ్ కోసం తాను అతన్ని ఒక్కసారి మాత్రమే కలిశానని, మళ్ళీ అతనితో ఎప్పుడూ మాట్లాడలేదని ఆమె స్పష్టం చేసింది. అయినా ఇలాంటి రూమర్స్ రావడంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

యూనియన్లు కార్మికులనుంచి లక్షలు దోచేస్తున్నాయ్ : ఫిలిం ఛాంబర్ విమర్శ