పబ్లిక్‌గా రణ్‌వీర్ సింగ్ బుగ్గపై ముద్దు పెట్టిన తమన్నా.. ఎందుకు?
'బాహుబలి- ది బిగినింగ్' ద్వారా బాలీవుడ్లో తన కంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న 'మిల్కీ బ్యూటీ' తమన్నా భాటియా.. ఎవ్వరూ ఊహించని విధంగా పొట్టి సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. 'చింగ్స్ సీక్రెట్
'బాహుబలి- ది బిగినింగ్' ద్వారా బాలీవుడ్లో తన కంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న 'మిల్కీ బ్యూటీ' తమన్నా భాటియా.. ఎవ్వరూ ఊహించని విధంగా పొట్టి సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. 'చింగ్స్ సీక్రెట్' ఆహార ఉత్పత్తుల సంస్థ ప్రమోషన్ కోసం ఆమె నటించిన 'రణ్‌వీర్ సింగ్ రిటర్న్స్' యాడ్ ఫిలిం ఆన్‌లైన్‌లో విడుదలై సంచలనం సృష్టిస్తోంది.
రణ్‌వీర్ సింగ్ హీరోగా, రోహిత్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ యాడ్ ఫిలిం.. సాధారణ మాస్ మసాలా సినిమా కంటే అత్యంత గ్రాండ్‌గా రూపొందించారు. ఈ ఐదున్నర నిమిషాల నిడివి గల ఈ షార్ట్ ఫిలింలో రణ్‌వీర్, తమన్నాల మధ్య రొమాంటిక్ సీన్లు, పాటలనూ పెట్టి రక్తికట్టించారు. రాజేష్ నరసింహన్ ఈ యాడ్ కథను అందించారు. గణేష్ ఆచార్య కొరియోగ్రఫీ చేశారు.
కాగా సామాజిక మాధ్యమాలలో మిల్కీ బ్యూటీకి చెందిన వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఓ స్టేజీపై అందరూ చూస్తుండగానే బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ బుగ్గపై ముద్దుపెట్టి అందరికి షాక్ ఇచ్చింది. వీరిద్దరు నటించిన యాడ్ ప్రమోషన్‌లో భాగంగా రణవీర్ సింగ్ వేదికపై డ్యాన్స్ చేస్తూ కింద పడిపోయాడు. అంతే తమన్నా ఒక్కసారి ఉలిక్కిపడి అతని బుగ్గపై ముద్దు పెట్టింది. మిల్కీ బ్యూటీ అందరి చూస్తుండగానే రణ్‌వీర్ సింగ్‌కు ముద్దు పెట్టడం బాలీవుడ్‌లో పెద్ద దుమారమే రేపింది.
రణ్‌వీర్ సింగ్ - తమన్నాలు చైనా నూడుల్స్‌కి బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఆ యాడ్ ఫిలిం తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషలలో రూపొందింది. తమన్నా తన ట్విట్టర్ ఖాతా ద్వారా కార్యక్రమంలో దిగిన కొన్ని ఫొటోలను, వీడియోను అభిమానులతో పంచుకున్నారు.