Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అడగ్గానే అందుకు ఒప్పేసుకుందట టబు... అఖిల్ కోసం...

ఎటో వెళ్ళిపోయింది మనస్సు.. ఇలా ఒంటరయ్యింది... అనే పాట వింటే వెంటనే నాగార్జున, టబులు గుర్తొస్తారు. వీరిలో నాగార్జున ఇంకా సినిమాల్లో నటిస్తూనే వుండగా, టబు మాత్రం పెద్దగా కనిపించడం లేదు. కారణం వయస్సు ఎక్కువ కావడం. అలాంటి టబు చాలా రోజుల తరువాత ఓ క్యారెక్

అడగ్గానే అందుకు ఒప్పేసుకుందట టబు... అఖిల్ కోసం...
, సోమవారం, 5 జూన్ 2017 (13:44 IST)
ఎటో వెళ్ళిపోయింది మనస్సు.. ఇలా ఒంటరయ్యింది... అనే పాట వింటే వెంటనే నాగార్జున, టబులు గుర్తొస్తారు. వీరిలో నాగార్జున ఇంకా సినిమాల్లో నటిస్తూనే వుండగా, టబు మాత్రం పెద్దగా కనిపించడం లేదు. కారణం వయస్సు ఎక్కువ కావడం. అలాంటి టబు చాలా రోజుల తరువాత ఓ క్యారెక్టర్‌ చేసేందుకు ఒప్పుకుంది. అందులోను నాగార్జున కుమారుడి సినిమాల్లో నటించేందుకు. అదీ అమ్మ పాత్రలో. అఖిల్‌కి అమ్మగా నటించడానికి టబు ఒప్పుకుందట. 
 
టబు. ఒకప్పుడు తెలుగు సినీరంగంలో తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకుంది. టబు సినిమాలంటే ఎగబడేవారు జనం. అలాంటి టబు ఆ తరువాత మెల్లమెల్లగా సినిమాల్లో నటించడం మానేసింది. అడపాదడపా అప్పట్లో కొన్ని సీరియళ్ళలో నటించినా ఆ తరువాత పూర్తిగా నటించడం మానేసింది. అయితే చాలారోజుల గ్యాప్ తరువాత అఖిల్ ఒక భారీ బడ్జెట్‌తో సినిమాను తీస్తున్నారు. 
 
ఆ సినిమాలో తల్లి పాత్ర ఎవరన్న విషయంపై తర్జనభర్జన పడుతున్నారు. తల్లి క్యారెక్టర్ కూడా పవర్‌ఫుల్‌గా ఉండాలి. అందంగా ఉండాలన్నదే సినీ యూనిట్ ఆలోచన. తల్లి క్యారెక్టర్ ఎవరు చేస్తే బాగుంటుందని అఖిల్‌ను అడిగితే వెంటనే టబు పేరు చెప్పాడట. ఆమె ఇప్పుడు సినిమాల్లో నటించడం లేదు కదా.. అంటే టబును నేను ఒప్పిస్తా.. అన్నాడట. చివరకు టబును కలిసి ఆ క్యారెక్టర్‌కు ఒప్పించాడట. మొత్తంమీద చాలారోజుల తరువాత టబు సినిమాల్లో తిరిగి వస్తుండటంతో అభిమానులు పండగ చేసుకోబోతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చలపతిరావు కామెంట్లపై రామ్ గోపాల్ వర్మ ఏమన్నారంటే? ఎంటర్‌టైన్‌గా తీసుకోవాలి..