Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

లేటెస్ట్ సుచీ లీక్స్ : ధనుష్, అనిరుధ్ నన్ను రేప్ చేశారు : గాయని సుచిత్ర ట్వీట్

తమిళ గాయని సుచిత్ర. ఈ పేరు వింటేనే దక్షిణాది సెలెబ్రిటీలు హడలిపోతున్నారు. సుచీలీక్స్ పేరుతో బహిర్గతమవుతున్న సెలెబ్రిటీల ప్రైవేట్ ఫోటోలు, వీడియోలో సంచలనం రేపుతున్నాయి. తాజాగా సుచీలీక్స్‌లో మరో బాంబు పే

లేటెస్ట్ సుచీ లీక్స్ : ధనుష్, అనిరుధ్ నన్ను రేప్ చేశారు : గాయని సుచిత్ర ట్వీట్
, మంగళవారం, 7 మార్చి 2017 (14:16 IST)
తమిళ గాయని సుచిత్ర. ఈ పేరు వింటేనే దక్షిణాది సెలెబ్రిటీలు హడలిపోతున్నారు. సుచీలీక్స్ పేరుతో బహిర్గతమవుతున్న సెలెబ్రిటీల ప్రైవేట్ ఫోటోలు, వీడియోలో సంచలనం రేపుతున్నాయి. తాజాగా సుచీలీక్స్‌లో మరో బాంబు పేలింది. 
 
తాజాగా తనపై తమిళ హీరో ధనుష్, యువ సంగీత దర్శకుడు అనిరుధ్‌లు అత్యాచారానికి పాల్పడ్డారంటూ సుచిత్ర ఆరోపించింది. తనకు ఇచ్చిన కూల్ డ్రింక్‌లో మత్తు మందు కలిపారని, మగతలోకి జారుకోగానే ఇద్దరూ తనపై పాశవికంగా ప్రవర్తించారని సంచలన కామెంట్స్ చేసింది. ఆ భయానక అనుభవాన్ని మాటల్లో చెప్పలేనని పేర్కొంది. 
 
అంతేకాదు కోలీవుడ్‌లో తనను ఎదిరించే మగాళ్లున్నారా అంటూ సవాల్ విసిరింది. తమిళ చిత్ర పరిశ్రమ అక్కడి కూవంనది కంటే కంపు కొడుతోందంటూ మండిపడింది. పోస్ట్ చేసిన వీడియోలన్నీ కూడా ధనుష్, అనిరుధ్ ఫోన్ల నుంచి తీసుకొనే లీక్ చేశానని తేల్చి చెప్పింది. 
 
తాను చేస్తున్న ఈ వ్యవహారం పట్ల పలువురు సినీ ప్రముఖులు, ధనుష్, అనిరుధ్ బెదిరిస్తున్నారని, తనపై కంప్లైంట్ చేస్తామంటూ హెచ్చరిస్తున్నారని.. అయితే.. తనపై ఏమని కంప్లైంట్ ఇస్తారో చెప్పాలని ఆమె ప్రశ్నించింది. వాళ్లలో ఎవరికైనా దమ్ముంటే.. ఆ వీడియోల్లో ఉన్నది నిజమా? కాదా? చెప్పాలని సవాల్ విసిరింది. 
 
కాగా, న్యూ ఇయర్ వేడుక కోసం డిసెంబరు 30న త్రిష థాయ్‌ల్యాండ్ వెళ్లిందని, ఆ మరుసటి రోజే ధనుష్ కూడా అక్కడకు వెళ్లాడని, బాగా ఎంజాయ్ చేశారని చెప్పింది. ఆ విషయం అవాస్తవమని వారు ఒప్పుకోగలరా? అని ఆమె ప్రశ్నించింది.
 
మరోవైపు.. తన భార్యకు పిచ్చిపట్టిందని, ఆమె మానసిక పరిస్థితి ఏమాత్రం బాగాలేదని సుచిత్ర భర్త కార్తీక్ ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో సుచీ లీక్స్ పేరుతో ఎవరు లీక్స్ చేస్తున్నారన్నది ఇపుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హోటల్‌కెళ్లి సెక్స్ కావాలంటూ వెయిటర్‌కు ఆర్డరిచ్చిన హీరోయిన్ ఎవరు?