Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రాజమౌళి మహాభారతం వేరు.. శ్రీకుమార్ మేనన్ భారతం వేరు.. జక్కన్నకు ఢోకా లేదు..?!

వీఏ శ్రీకుమార్ మేనన్ దర్శకత్వంలో మహాభారంతం రూపుదిద్దుకోనుందని వార్తలు రాగానే.. జక్కన్న రాజమౌళి షాక్ తిన్నారు. ఆయన ఫ్యాన్స్ కూడా ఖంగుతిన్నారు. అబ్బే బాహుబలి కంటే మహాభారతం బంపర్ హిట్ అవుతుందని.. అది రాజ

రాజమౌళి మహాభారతం వేరు.. శ్రీకుమార్ మేనన్ భారతం వేరు.. జక్కన్నకు ఢోకా లేదు..?!
, మంగళవారం, 18 ఏప్రియల్ 2017 (17:07 IST)
వీఏ శ్రీకుమార్ మేనన్ దర్శకత్వంలో మహాభారంతం రూపుదిద్దుకోనుందని వార్తలు రాగానే.. జక్కన్న రాజమౌళి షాక్ తిన్నారు. ఆయన ఫ్యాన్స్ కూడా ఖంగుతిన్నారు. అబ్బే బాహుబలి కంటే మహాభారతం బంపర్ హిట్ అవుతుందని.. అది రాజమౌళి కెరీర్ ఖాతాలో పడుతుందని అందరూ అనుకున్నారు. కానీ హైలీ టాలెంటెడ్ యాడ్ ఫిలిమ్ మేకర్‌గా పేరున్న వీఏ శ్రీకుమార్ మేనన్ దర్శకత్వంలో భారతీయ సినీ చరిత్రలో ఎన్నడూ లేనంతగా వెయ్యి కోట్ల రూపాయల పెట్టుబడితో 'ది మహాభారత' అనే సినిమా రూపొందనుందని ప్రకటన వచ్చింది.
 
ఈ చిత్రానికి యూ.ఏ.ఈ కి చెందిన ఓ భారతీయ వ్యాపారవేత్త ఏకంగా రూ.1000 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు రెడీ అయిపోయాడు. ఈ చిత్రాన్ని రెండు పార్టులుగా శ్రీకుమార్ తెరకెక్కించాలనుకుంటున్నాడు. ఆంగ్లం, హిందీ, మలయాళం, కన్నడ, తమిళం, తెలుగు భాషల్లో రానున్న ఈ సినిమాను 100 విదేశీ భాషల్లో డబ్బింగ్ చేయాలనుకుంటున్నట్లు సమాచారం. 
 
అయితే ఈ మహాభారతం ప్రముఖ రచయిత ఎం.టి వాసుదేవన్‌ నాయర్‌ రాసిన 'రాందమూళం' నవల ఆధారంగా తెరకెక్కబోతోంది. భీముడి పాత్రమీద ఎక్కువ ఫోకస్ చేయబోతోన్న ఈ సినిమాని వచ్చే ఏడాది ప్రారంభిస్తారు. 2020 నాటికి సినిమాను రిలీజ్ చేస్తారని తెలుస్తోంది. అయితే రాజమౌళి మహాభారత కథకు ఈ సినిమాకు క్లాష్ తప్పదని సినీ పండితులు అంటున్నారు. కలెక్షన్ల పరంగా రాజమౌళికి దెబ్బేనని వారు జోస్యం చెప్తున్నారు. 
 
విజయేంద్రప్రసాద్ కథతో మహాభారతాన్ని తెరకెక్కించడం తన ఆశయమని చెప్పుకొచ్చిన రాజమౌళి.. శ్రీకుమార్ డైరక్షన్ చేసే మహాభారతంతో తన కల చెదిరిందని అనుకున్నారు. కానీ శ్రీకుమార్ మహాభారతం నవల ఆధారంగా తెరకెక్కనుండటంతో.. కాస్త జక్కన్న ఊపిరిపీల్చుకున్నారు. తన మహాభారతం మహాభారత ఇతిహాసాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కుతుందని రాజమౌళి చెప్తున్నారు. భీముడిని హైలైట్ చేస్తూ.. శ్రీకుమార్ మహాభారతం ప్రేక్షకుల ముందుకొస్తే.. తన మహాభారతం.. ఇతిహాసంలోని ప్రతీ పాత్రను హైలైట్ చేస్తూ తెరకెక్కుతుందని అంటున్నారు.
 
ఏది ఏమైనా భారతీయ సినీ చరిత్రలో రికార్డుల పంట పండించిన బాహుబలి సినిమాకు ధీటుగా మరో ఇతిహాస ఇతివృత్తంతో జక్కన్న మహాభారతాన్ని తెరకెక్కించేందుకు రెడీ అయ్యారు. జక్కన్నకు పోటీగా శ్రీకుమార్ కూడా బరిలోకి దిగడం కళాకారుల మధ్య పోటీ వాతావరణాన్ని నెలకొల్పిందని.. ఇది భారతీయ సినీ ఇండస్ట్రీకి శుభపరిణామమేనని సినీ పండితులు అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాలీవుడ్ 'మహాభారతం'.. కృష్ణుడుగా అక్షయ్ కుమార్.. భీష్ముడు... ద్రౌపది... పంచ పాండవులుగా ఎవరు?