Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆ వీక్‌నెస్‌తో నన్ను వాడేస్తున్నారంటున్న శృతిహాసన్

చేతిలో పెద్దగా సినిమాలు లేకపోయినా శృతిహాసన్ ఏ మాత్రం క్రేజ్ తగ్గడం లేదు. ఏ కార్యక్రమానికి వెళ్ళినా శృతిహాసన్‌ను చూసేందుకు అభిమానులు క్యూలు కడుతుంటారు. కమలహాసన్ కుమార్తెగా కన్నా శృతి గ్రేట్ అని చెప్పించుకోవడమే ఆమెకు ఇష్టమట. చిన్నప్పటి నుంచి కుటుంబంలో

Advertiesment
sruthi hassan
, ఆదివారం, 13 ఆగస్టు 2017 (14:31 IST)
చేతిలో పెద్దగా సినిమాలు లేకపోయినా శృతిహాసన్ ఏ మాత్రం క్రేజ్ తగ్గడం లేదు. ఏ కార్యక్రమానికి వెళ్ళినా శృతిహాసన్‌ను చూసేందుకు అభిమానులు క్యూలు కడుతుంటారు. కమలహాసన్ కుమార్తెగా కన్నా శృతి గ్రేట్ అని చెప్పించుకోవడమే ఆమెకు ఇష్టమట. చిన్నప్పటి నుంచి కుటుంబంలో నెలకొన్న సమస్యలను ప్రత్యక్షంగా అనుభవించిన శృతి హాసన్ ఆ తరువాత  మోడలింగ్ చేస్తూ సినిమాల్లో నటిస్తూ తన కాళ్ళపై తాను నిలబడుతోంది.
 
కానీ శృతిహాసన్‌కు ఉన్న వీక్‌నెస్‌తో సినీపరిశ్రమలో ఆమెను కొంతమంది వాడేస్తున్నారట. సినిమా షూటింగ్ స్పాట్‌లకు వెళ్ళినప్పుడు పక్కనే తనకు నచ్చిన ప్రాంతాలేవైనా ఉంటే అక్కడికి వెళితే తిరిగి రాలేకపోతోందట శృతిహాసన్. ప్రకృతి సహజసిద్ధంగా ఉండే ప్రాంతాలైతే ఇంకా ఇష్టమట. సింగపూర్, అమెరికా, గోవా, కేరళ లాంటి ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడి ప్రకృతి అందాలను చూస్తే ఇక షూటింగ్‌కు డుమ్మా కొట్టి అక్కడే తిరుగుతుంటాను. అందుకే డైరెక్టర్లు ఏంటమ్మా..ఇలా చేస్తున్నావు.. సమయం వృథా చేశావు.. రాత్రంతా షూటింగ్ చేద్దామంటూ నిద్ర లేకుండా నటింపజేస్తున్నారని చెబుతోందట శృతి.
 
ఇష్టమైన ప్రాంతాలను చూసినప్పుడు ఎంతసేపయినా కష్టపడి పనిచేయాలనుకుంటానని, నిద్రలేకున్నా ఫర్వాలేదని, కానీ యోగా మాత్రం ఖచ్చితంగా ఉదయాన్నే లేచి చేస్తానని చెబుతోందట శృతి హాసన్. ప్రతి ఒక్కరు వ్యాయామం అలవాటు చేసుకుంటే ఎంతోమంచిదని సలహా కూడా ఇచ్చేస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రానా దానికి పనికిరాడనుకున్నా.. ఎవరు..?