Sreeleela Marriage: పెళ్లి సందD సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది శ్రీలీల. కానీ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది. ముఖ్యంగా ధమాకా సినిమాతో ఓవర్ నైట్‌లోనే స్టార్ సెలబ్రిటీ అయిపోయిన శ్రీలీల, ఒకే ఏడాది 9 సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి అందరికీ షాక్ ఇచ్చింది.
అయితే ఆ తర్వాత కాలంలో ఈమె నటించిన ప్రతి సినిమా కూడా యావరేజ్ గానే నిలిచింది. ఇకపోతే చివరిగా బాలకృష్ణ హీరోగా నటించిన భగవంత్ కేసరి సినిమాలో బాలకృష్ణకి కూతురు గెటప్‌లో నటించింది.
అయితే ఈ సినిమా విజయం సాధించినా.. ఆ క్రెడిట్ మాత్రం బాలకృష్ణ ఖాతాలో చేరిపోయిందని చెప్పాలి. ఇకపోతే ఈ సినిమా సమయం నుంచి ఇద్దరి మధ్య బంధం మరింత పెరిగింది. బాలకృష్ణ కూడా సొంత కుటుంబ సభ్యురాలి గానే శ్రీలీలను ట్రీట్ చేయడం మొదలుపెట్టారు. అందులో భాగంగానే తాజాగా శ్రీలీల బాలయ్య హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ విత్ ఎన్బికె సీజన్ ఫోర్ కార్యక్రమానికి హాజరయ్యింది.
అందులో భాగంగానే బాలకృష్ణతో మహేష్ బాబు కళ్ళు అంటే చాలా ఇష్టమని, అవే కాకుండా ఆయన కటౌట్ అంటే మరింత ఇష్టం అని తెలిపిన ఈమె, కన్నడ హీరో యష్, టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ క్యారెక్టర్లు ఇష్టమని తెలిపింది. మహేష్ బాబు కటౌట్‌తో యష్, అల్లు అర్జున్‌లలో ఉన్న క్వాలిటీస్ కలిగిన అబ్బాయిని నీకు భర్తగా తీసుకొచ్చే బాధ్యత నాది అంటూ బాలయ్య శ్రీలీలకు ఒక ప్రామిస్ చేశారు.