Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సోనీ నెట్ వర్క్ చేతిలో బాహుబలి-2 హిందీ శాటిలైట్ రైట్స్.. రూ.51కోట్లు చెల్లించి?

బాహుబలి-2 పబ్లిసిటీలోనే కాదు.. మార్కెటింగ్ పరంగానూ సంచనాలకు కేంద్ర బిందువు అవుతోంది. భారత చలనచిత్ర పరిశ్రమలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న బాహుబలి-2.. ఈ చిత్రం తమిళ రైట్స్‌ పెద్దమొత్తానికి అమ్

Advertiesment
Sony buys Baahubali 2 satellite rights for ₹51 cr: Reports
, ఆదివారం, 29 జనవరి 2017 (18:38 IST)
బాహుబలి-2 పబ్లిసిటీలోనే కాదు.. మార్కెటింగ్ పరంగానూ సంచనాలకు కేంద్ర బిందువు అవుతోంది. భారత చలనచిత్ర పరిశ్రమలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న బాహుబలి-2.. ఈ చిత్రం తమిళ రైట్స్‌ పెద్దమొత్తానికి అమ్ముడుపోయినట్టు సమాచారం. థియేటర్ రిలీజ్ హక్కులను శ్రీ గ్రీ న్ ప్రొడక్షన్ హౌస్ దక్కించుకున్నట్టు కోలీవుడ్ వర్గాల భోగట్టా. 
 
రజనీకాంత్ సినిమాలకు ఆఫర్ చేసే మొత్తం కంటే ఇది కొద్దిగా తక్కువే అయినా.. తమిళంలో ఇతర అగ్రహీరోల సినిమాల రైట్స్‌కు ఆఫర్ చేసే మొత్తం కంటే ఎక్కువని.. సదరు ప్రొడక్షన్ హౌస్ బాహుబలి నిర్మాతలకు ఆపర్ ఇచ్చి డీల్ సీల్ చేసుకున్నట్టు తెలుస్తోంది. ఆసక్తికరంగా 'బాహుబలి-2' హిందీ శాటిలైట్ హక్కులను 'సోనీ నెట్ వర్క్' ఎగురేసుకుపోయింది.
 
ఇందుకు గాను నిర్మాతలకు రూ.51 కోట్లు చెల్లించేందుకు ఒప్పందం చేసుకున్నట్టు కూడా తెలుస్తోంది. ఒక డబ్బింగ్ చిత్రానికి, అందులోనూ ఓ ప్రాంతీయ చిత్రాన్ని టీవీల్లో ప్రసారం చేసేందుకు ఇంతవరకూ ఇంతపెద్ద మొత్తం చెల్లించడం ఇదే ప్రథమం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సమంత, నాగచైతన్యల నిశ్చితార్థం నేడే.. నా మూడ్ ఇదే అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్..