ఆనంద్ అహుజాతో రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయిన సోనమ్ కపూర్
బాలీవుడ్ ప్రేమపక్షుల జాబితాలో ఇప్పుడు మరో జంట చేరిపోయింది. ఆ జంట ఎవరోకాదు బాలీవుడ్ హీరో అనిల్ కపూర్ తనయ సోనమ్ కపూర్ - ఆనంద్ అహూజా. ఢిల్లీకి చెందిన ఆనంద్ అహూజా అనే బిజినెస్‌మెన్‌తో ఆమె డేటింగ్‌లో ఉ
బాలీవుడ్ ప్రేమపక్షుల జాబితాలో ఇప్పుడు మరో జంట చేరిపోయింది. ఆ జంట ఎవరోకాదు బాలీవుడ్ హీరో అనిల్ కపూర్ తనయ సోనమ్ కపూర్ - ఆనంద్ అహూజా. ఢిల్లీకి చెందిన ఆనంద్ అహూజా అనే బిజినెస్‌మెన్‌తో ఆమె డేటింగ్‌లో ఉందని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరు రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారని ఆమెకు సన్నిహితులు అంటున్నారు. గతంలో కూడా ఓ సినిమా షూటింగ్ కోసం విదేశాలకు వెళ్తూ వారిద్దరూ ఎయిర్‌పోర్టులో మీడియా కంటపడిన సంగతి తెలిసిందే.
ఇప్పుడీ జంట రెడ్ హ్యండడ్‌గా దొరికిపోయింది. ఇటీవల ఫ్యామిలీ పార్టీకి ఆనంద్ అహూజా పిలిచిన సోనం అతగాడితో బాగా క్లోజ్‌గా మూవ్ అయింది. కుటుంబ వేడుకలో భాగంగా దిగిన ఆ ఫొటోలో రియాతోపాటు అర్జున్ కపూర్, సోనమ్ కపూర్, ఆనంద్ అహూజా తదితరులు ఉన్నారు. సోనమ్ మాత్రం తన ప్రియుడిగా ప్రచారం జరుగుతున్న ఆనంద్ చేతిని పట్టుకుని ఫొటోకు పోజిచ్చారు. దీంతో సోనమ్ అతడితో తన బంధాన్ని చెప్పకనే చెప్పిందని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. 2010లో ఐ హేట్ లవ్ స్టోరీస్ అంటూ ప్రేక్షకులను అలరించిన ఆమె ప్రస్తుతం ఐ లవ్ లవ్ స్టోరీస్ అంటోంది.