Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పార్టీలో మహిళను హగ్ చేసుకుని వాటిని టచ్ చేసిన సింగర్...

బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ సింగర్‌ను ముంబై పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. తనకు వీరాభిమాని అయిన ఓ మహిళ.. సింగర్‌తో కరచాలనం చేసేందుకు దగ్గరకు వచ్చింది. ఆమెతో కరచాలనం చేసిన తర్వాత హగ్ పేరుతో దగ్గరకు తీసు

Advertiesment
Singer Yash Wadali
, శనివారం, 5 ఆగస్టు 2017 (08:41 IST)
బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ సింగర్‌ను ముంబై పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. తనకు వీరాభిమాని అయిన ఓ మహిళ.. సింగర్‌తో కరచాలనం చేసేందుకు దగ్గరకు వచ్చింది. ఆమెతో కరచాలనం చేసిన తర్వాత హగ్ పేరుతో దగ్గరకు తీసుకుని వక్షోజాలను నొక్కి అసభ్యంగా ప్రవర్తించినట్టు సమాచారం. దీంతో షాక్‌కు గురైన ఆ మహిళ ఆ సింగర్‌పై ఫిర్యాదు చేయగా, పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
ముంబై బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో 27 యేళ్ళ యశ్ వడలి అనే సింగర్ ఉన్నారు. ఈయన ఓ పార్టీకి హాజరు కాగా, అదే పార్టీకి 39 యేళ్ళ మహిళ ఒకరు వచ్చింది. ఆమె పట్ల ఈయన అసభ్యంగా ప్రవర్తించినట్టు పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో సబర్బన్ అంధేరీలోని రెస్టోబార్ ఈవెంట్‌లో లైవ్‌ ఫర్‌ఫార్మెన్స్ ఇస్తుండగా పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. 
 
నిజానికి పోలీసుల రాకను గమనించిన యశ్ వడలి.. స్టేజ్‌పై నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. పోలీసులు అప్రమత్తమై అతన్ని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'చుక్కలు' చూపించిన కృష్ణవంశీ...