వెండితెరపై నటిగా గీతామాధురి!
తెలుగు సినిమా పాటని తన గాత్రంతో హుషారుగా పరిగెత్తించిన గాయని గీతామాధురి. అందమైన స్వరం గీతామాధురి సొంతం. అందువలన ఆమెకి యూత్‌లో క్రేజ్ వుంది. ఆకర్షణీయమైన రూపం కావడం వలన ఆమెను వెండితెరపై చూపించాలని పలువ
తెలుగు సినిమా పాటని తన గాత్రంతో హుషారుగా పరిగెత్తించిన గాయని గీతామాధురి. అందమైన స్వరం గీతామాధురి సొంతం. అందువలన ఆమెకి యూత్‌లో క్రేజ్ వుంది. ఆకర్షణీయమైన రూపం కావడం వలన ఆమెను వెండితెరపై చూపించాలని పలువురు ప్రయత్నాలు కూడా చేశారు.
సున్నితంగా తిరస్కరించిన ఆమె ఇప్పుడు 'అతిథి' అనే లఘు చిత్రంలో నటించింది. దీనితో త్వరలో వెండితెరపై కనిపించనుందనే వార్తలు వచ్చేశాయి. ఇప్పటికే ఆమె ఒక సినిమాలో నటించిందనీ.. ఆ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుందని అంటున్నారు. త్వరలో దీనిపై ఆమె వివరణ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.