Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పిల్లల్ని కనాలంటే పెళ్ళెందుకు బాస్? ఓ వ్యక్తి నచ్చితే అతనితో పిల్లల్ని కంటాను!: శృతిహాసన్

విశ్వనటుడు కమల్ హాసన్ కుమార్తెగా వెండితెర అరంగేట్రం చేసిన నటి శృతిహాసన్. ఆ తర్వాత తన నటనతో చిత్రపరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. అయితే, ఈమె చిత్రపరిశ్రమలో అడుగుపెట్టిన కొత్తల్లో ఓ సం

Advertiesment
Shruti Haasan
, బుధవారం, 24 మే 2017 (14:53 IST)
విశ్వనటుడు కమల్ హాసన్ కుమార్తెగా వెండితెర అరంగేట్రం చేసిన నటి శృతిహాసన్. ఆ తర్వాత తన నటనతో చిత్రపరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. అయితే, ఈమె చిత్రపరిశ్రమలో అడుగుపెట్టిన కొత్తల్లో ఓ సంగీత దర్శకుడిపై మనస్సు పారేసుకుందట. ఆ తర్వాత అతనితో చాలా సన్నిహితంగా మెలుగుతూ వచ్చిందట. అలా క్లోజ్‌గా ఉండటానికి గల కారణం తెలుసుకున్న తర్వాత అతనితో కటీఫ్ చెప్పేసిందట. ఇదే అంశంపై శృతిహాసన్ తాజా స్పందిస్తూ... 
 
"గతంలో ఓ మ్యూజిక్ డైరెక్టర్‌ను బాగా ఇష్టపడ్డాను. ఆయన చాలా మంచి వ్యక్తి. మేమిద్దరం చాలా క్లోజ్‌గా మూవ్ అయ్యేవాళ్లం. దానినే నేను ప్రేమ అనుకున్నాను... అయితే నాది ప్రేమ కాదు ఆకర్షణ అని తర్వాత తెలిసింది" అని చెప్పింది. రిలేషన్ బ్రేకప్ అయిన తర్వాత దానిని తాను అర్థం చేసుకున్నానని చెప్పింది. ఆ తర్వాత ఇక ఎవరితోనూ ఆ తరహా రిలేషన్ పెట్టుకోలేదని చెప్పింది.
 
ఇకపోతే ప్రస్తుతానికి తనకు బాయ్ ఫ్రెండ్‌కి కేటాయించేంత టైమ్ లేదని చెప్పింది. పెళ్లి గురించి కూడా ప్రస్తుతం ఎలాంటి ఆలోచన లేదని తెలిపింది. పిల్లల్ని కనాలంటే పెళ్లి చేసుకోవాలన్న రూల్ ఏమీ లేదని, తనకు ఒక వ్యక్తి నచ్చితే అతనితో పిల్లల్ని కంటానని చెప్పింది. ఈ విషయంలో తన తల్లిదండ్రులే ఆదర్శమని చెప్పింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాజమౌళి ఇంటికి చిరంజీవి ఎందుకు వెళ్లినట్లు...? అది అడగటానికేనా...?