Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

23 యేళ్ళ కుర్రోడు తనను బాగా సంతృప్తిపరిచాడంటున్న శ్రియ!

తెలుగు, తమిళ భాషల్లో సీనియర్ కథానాయకుల జోడీగా వరుస అవకాశాలను సంపాదించుకుంటూ శ్రియ తన కెరియర్‌ను పరిగెట్టిస్తోంది. తన గ్లామర్‌తో కుర్రకారు మనసులు దోచేస్తూ వచ్చిన శ్రియ, ఇక భయపెట్టే సినిమాల్లోనూ నటించడా

Advertiesment
23 యేళ్ళ కుర్రోడు తనను బాగా సంతృప్తిపరిచాడంటున్న శ్రియ!
, గురువారం, 31 ఆగస్టు 2017 (09:31 IST)
తెలుగు, తమిళ భాషల్లో సీనియర్ కథానాయకుల జోడీగా వరుస అవకాశాలను సంపాదించుకుంటూ శ్రియ తన కెరియర్‌ను పరిగెట్టిస్తోంది. తన గ్లామర్‌తో కుర్రకారు మనసులు దోచేస్తూ వచ్చిన శ్రియ, ఇక భయపెట్టే సినిమాల్లోనూ నటించడానికి రెడీ అవుతోంది. నయనతార, త్రిషల తరహాలోనే సస్పెన్స్ థ్రిల్లర్ కథల వైపు అడుగులు వేస్తోంది.
 
త్వరలో తాను 'సైకో థ్రిల్లర్' నేపథ్యంలో సాగే సినిమా చేయనున్నట్టు ఆమె చెప్పింది. ఈ తరహా సినిమాల్లో చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాననీ, అలాంటి కథ తనని వెతుక్కుంటూ రావడం ఆనందంగా.. ఆశ్చర్యంగా ఉందని అంది. ఓ 23 యేళ్ల కుర్రాడు తనని ఈ కథతో మెప్పించాడనీ, ఈ సినిమాతోనే దర్శకుడిగా పరిచయమవుతున్నాడని చెప్పింది. ఈ సినిమాలో తాను కొత్తగా కనిపిస్తాననీ, త్వరలోనే సెట్స్‌పైకి వెళుతున్నామని శ్రియ చెప్పుకొచ్చింది. 
 
అంతేకాకుండా, బాలకృష్ణ కథానాయకుడిగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'పైసా వసూల్' రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రంలో తాను జర్నలిస్ట్ పాత్రలో కనిపిస్తానని చెప్పింది. తన పాత్ర చాలా సరదాగా ఉంటుందనీ, కథానాయకుడి పాత్రతో లింకై ఉంటుందని అంది.
 
బాలకృష్ణతో కలిసి మరోసారి నటించే ఛాన్స్ రావడం ఆనందాన్ని కలిగించిందని చెప్పింది. ఇక పూరి దర్శకత్వంలో చేయాలని చాలాకాలం నుంచి అనుకుంటున్నాననీ, అది ఇప్పటికి కుదిరిందని తెలిపింది. ఆయన దర్శకత్వంలో చేయడం తన అదృష్టంగా భావిస్తున్నట్టు చెప్పుకొచ్చింది. పాత్రలను ఆసక్తికరంగా మలచడంలోనూ, వాటిని తెరపై ఆవిష్కరించడంలోనూ ఆయన సూపర్ అంటూ కితాబునిచ్చింది. ఈ సినిమా తప్పకుండా హిట్ కొడుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పీకే ఫ్యాన్స్ హింస పెడుతున్నారు... మొబైల్‌ను కూడా వాడలేక పోతున్నా : మహేష్ కత్తి