మెగా బ్రదర్ నాగబాబు తన మనసులో ఏమనుకుంటారో అదే తన యూట్యూబ్ ఛానల్ ద్వారా చెప్పేస్తుంటారు. ఐతే ఆ కామెంట్లు కొన్నిసార్లు ఫైర్ అయితే మరికొన్నిసార్లు మిస్ ఫైర్ అయ్యాయి. ఆ సంగతి అలా వుంచితే నాగబాబు జబర్దస్త్ షోని వదిలేసి జి ఛానల్లో అదిరింది షోకి వెళ్లి ఫుల్ కామెడీ అయిపోయారంటూ సెటైర్లు వినిపిస్తున్నాయి.
అదిరింది షోని నాగబాబు ఎంత లేపుదామన్నా లేపలేకపోతున్నారట. అందులో చేస్తున్న కామెడీకి జనం పెద్దగా స్పందించడంలేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇకపోతే తాజాగా నాగబాబు యూ ట్యూబులో మరో రెండు కామెడీ షోస్ ప్లాన్ చేస్తున్నట్లు వెల్లడించారు.
సత్తా వున్నవారు సంప్రదించవచ్చని కూడా తెలిపారు. కానీ అదిరింది షోనే అదరగొట్టలేకపోతున్నారు ఇక యూ ట్యూబులో ఆ షోలను ఏం చేస్తారోనన్న కామెంట్లు వస్తున్నాయి. చూడాలి, మెగాబ్రదర్ కామెడీ షోలు ఎలా వుంటాయో?