శ్రుతిహాసన్ బొద్దుగా మారిపోయిందా? సైజులు మారిపోయాయా?
శ్రుతిహాసన్ ఫేడవుట్ అయిపోయిందా..? గ్లామర్ తగ్గిపోయిందా? అంటే అవునని అంటున్నారు సినీ పండితులు. ఐరన్ లెగ్‌గా కెరీర్‌లో ముద్ర వేసుకుని.. గబ్బర్ సింగ్‌తో ఒక్కసారిగా గోల్డెన్ లెగ్‌గా మారిపోయిన శ్రుతికి మంచ
శ్రుతిహాసన్ ఫేడవుట్ అయిపోయిందా..? గ్లామర్ తగ్గిపోయిందా? అంటే అవునని అంటున్నారు సినీ పండితులు. ఐరన్ లెగ్‌గా కెరీర్‌లో ముద్ర వేసుకుని.. గబ్బర్ సింగ్‌తో ఒక్కసారిగా గోల్డెన్ లెగ్‌గా మారిపోయిన శ్రుతికి మంచి అవకాశాలు వచ్చాయి. శ్రీమంతుడు వంటి హిట్ సినిమాలతో టాప్ హీరోయిన్‌గా ఎదిగిపోయింది. అయితే కాటమరాయుడు సినిమా ద్వారా శ్రుతికి అవకాశాలు తగ్గిపోతున్నాయని సినీ పండితులు అంటున్నారు. శ్రుతిహాసన్ ఫిజిక్ పరంగా పక్కాగా ఉండేది. కానీ తొలిసారిగా భారమైన పాత్రలో కనిపించనుంది.
హిందీ సినిమా బహెన్ హోగీ తేరి కోసం కొంత బరువు పెరగాల్సి వచ్చిందట. దాంతో కొంతకాలం శారీరక వ్యాయామాన్ని పక్కనబెట్టి అధిక క్యాలెరీలు కలిగిన ఆహారాన్ని తీసుకుందట. దీంతో అమ్మడి సైజులు మారిపోయాయి. బొద్దుగా మారిపోయింది. ప్రస్తుతం బరువు పెరగడంతో పాటు, భారీ బడ్జెట్ సినిమా సంఘమిత్ర కోసం ప్రస్తుతం గుర్రపుస్వారీ నేర్చుకోవడమే కాక, కత్తి సాము వంటి యుద్ద విద్యల్లో శిక్షణ తీసుకుంటుంది... శ్రుతిహాసన్.