Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చైతూను సమంత మరవలేకపోతుందా?

Advertiesment
Samantha
, శుక్రవారం, 29 జులై 2022 (12:16 IST)
సమంత-నాగచైతన్య పెళ్లికి తర్వాత సూపర్ ఇంటిని కొనుగోలు చేశారు. అయితే విడాకులతో విడిపోయాక వారు గతంలో కలిసి ఉన్న అపురూపమైన ఇంటిని సమంత మళ్లీ కొనుగోలు చేయడం హాట్ టాపిక్‌గా మారింది. సమంత గతంలో చైతుతో ఉన్న ఇంటిని భారీ ధరకు తిరిగి కొనుగోలు చేసిందట. 
 
ఈ విషయాన్ని ఆ అపార్ట్మెంట్ ఓనర్ అయిన నటుడు మురళీమోహన్ బయటపెట్టారు. దీంతో సమంత మనసు మార్చుకుందని.. వారిద్దరు మళ్లీ కలిసే అవకాశం ఉందని అందరూ అనుకుంటున్నారు. చైతూతో ఉన్న పాత ఇల్లునే భారీగా డబ్బులు పెట్టి కొనుగోలు చేయడం వెనుక అసలు కారణమేంటనే కోణంలో అందరూ ఆలోచిస్తున్నారు.
 
వీరి పెళ్లికి ముందు ఓ పెంట్ హౌస్‌ను నాగచైతన్య కొనుగోలు చేశాడు. పెళ్లయిన తరువాత వీరు అందులోనే ఉన్నారు. కానీ వారికి ఓ కొత్త ఇల్లు కావాలని మరో ఇల్లు చూసుకున్నారు. దీన్ని అమ్మేశారు. కానీ మళ్లీ అదే ఇంటిని సమంత తిరిగి కొనుగోలు చేసింది. 
 
ఎందుకంటే ఇక్కడ తనకు సెక్యూరిటీ ఉంటుందని చెబుతోంది. నగరం నడిబొడ్డున, విశాలమైన, ప్రశాంతమైన ప్రాంతం కావడం వల్లే చైతన్యతో గతంలో జీవించిన ఇంటిని సమంత తిరిగి కొన్నదని టాక్. 
 
తన తల్లితో కలిసి సమంత అక్కడే ఉంటోందట.. చైతూతో తిరిగిన ఆ ఇల్లునే మళ్లీ ఎక్కువ ధరకు కొనుగోలు చేయడం వెనుక ఆమె చైతును మరిచిపోలేకపోతోందనే వాదనలు కూడా వస్తున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రామారావు ఆన్‌ డ్యూటీ రివ్యూ రిపోర్ట్