Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చైతూను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది... సమంత

టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారిన సమంత, చైతూల ప్రేమ గురించి రోజుకో వార్త మీడియాలో వస్తోంది. వీళ్ళ ప్రేమాయణంపై అభిమానుల్లో అనేక సందేహాలు నెలకొన్న నేపథ్యంలో ఈ ప్రేమ జంట తాము త్వరలో పెళ్లి చేసుకోబోతున్న

Advertiesment
Samantha Ruth Prabhu
, గురువారం, 27 అక్టోబరు 2016 (09:31 IST)
టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారిన సమంత, చైతూల ప్రేమ గురించి రోజుకో వార్త మీడియాలో వస్తోంది. వీళ్ళ ప్రేమాయణంపై అభిమానుల్లో అనేక సందేహాలు నెలకొన్న నేపథ్యంలో ఈ ప్రేమ జంట తాము త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్టు క్లారిటీ ఇచ్చింది. చైతూ అంటే సమంతకు ఎంత ప్రేమో, సమంత అన్నా చైతూకు అంతే ప్రేమ. వీరిద్దరు పలు ఇంటర్వ్యూలలో ఒకరిపై ఒకరికి ఎంత ప్రేమ ఉందో చెప్పకనే చెప్పారు.
 
నాగచైతన్య విషయంలో సమంత మరింత ఓపెన్ అయిపోయింది. అతను లేకుండా బతకలేను అనేసింది. మీకు ప్రస్తుతం ట్విట్టర్లో చిట్‌చాట్ సందర్భంగా 'జీవితంలో అత్యంత ముఖ్యమైనవి ఏంటి.. ఏవి లేకుండా బతకలేరు' అంటూ ఓ అభిమాని ప్రశ్నకు... ''నాగచైతన్య, మస్కతి ఐస్ క్రీమ్, పని'' అంటూ తనదైనశైలిలో సమాధానమిచ్చింది. కెరీర్‌లో మీకు అత్యంత ఇష్టమైన సినిమా ఏదంటే.. చైతూ కాంబినేషన్‌లో తాను చేసిన తొలి సినిమా 'ఏమాయ చేసావె'. ఆ సినిమాని నా జీవితంలో మర్చిపోలేను అని సమంత చెప్పడం విశేషం. 
 
ప్రేమమ్ సినిమాలో నాగచైతన్య నటన గురించి ఓ ప్రశ్న అడిగితే.. అతణ్ని చూసి చాలా గర్వంగా ఫీలవుతున్నానని సమంత చెప్పుకొచ్చింది. మీ జీవితంలో అందుకున్న అత్యంత ముఖ్యమైన సలహా ఏదని అడిగితే.. 'ప్రతి సినిమానూ నీ తొలి సినిమాలాగే ఫీలవ్వు' అన్న మహేష్ బాబు చెప్పిన మాటను గుర్తు చేసుకుంది. మీ బలం ఏంటి అని అడిగితే.. నాకేం కావాలో నాకు తెలవడమే అని సమంత బదులిచ్చింది. 
 
''పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్లో రాబోయే కొత్త సినిమాలో హీరోయిన్ మీరేనంటూ వస్తున్న వార్తలపై ఏమంటారు'' అని అడిగితే.. అది ఒట్టి రూమర్లేనని సమంత క్లారిటీ ఇచ్చింది. ఈ మధ్య కాలంలో వచ్చిన పాటల్లో విక్రమ్ 'ఇంకొక్కడు' సినిమాలోని 'హెలెనా' అని చెప్పింది. సల్మాన్ ఖాన్ సినిమాల్లో అత్యంత ఇష్టమైంది ఏదంటే 'సుల్తాన్' అని సమంత చెప్పుకొచ్చింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'సర్కార్' హక్కులు నా సొంతం.. నీవెలా సీక్వెల్ తీస్తావ్.. రాంగోపాల్ వర్మకు లీగల్ నోటీసు