హిట్స్ కోసం విశాల్ పాకులాట.. పందెంకోడి 2లో విశాల్‌తో జతకట్టనున్న సమంత?
సౌత్‌లో సమంత హవా మాములుగా లేదు. బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్లతో.. సౌత్‌ని షేక్ చేస్తుంది ఈ అమ్మడు. ఇప్పటివరకు నెం.1 హీరోయిన్‌గా టాలీవుడ్‌లో సత్తాచాటిన ఈ అమ్మడు… ఇప్పుడు ఫోకస్ సొంత స్టేట్ పైకి షిప్ట్ చేసింది.
సౌత్‌లో సమంత హవా మాములుగా లేదు. బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్లతో.. సౌత్‌ని షేక్ చేస్తుంది ఈ అమ్మడు. ఇప్పటివరకు నెం.1 హీరోయిన్‌గా టాలీవుడ్‌లో సత్తాచాటిన ఈ అమ్మడు… ఇప్పుడు ఫోకస్ సొంత స్టేట్ పైకి షిప్ట్ చేసింది. ఇక్కడ టాప్ హీరోలతో వరుస హిట్లు కొడుతూ గోల్డెన్ లెగ్ బ్యూటీగా సందడి చేసిన సమంత.. కోలీవుడ్‌లో మాత్రం స్టార్టింగ్‌లోనే స్టార్ హీరోలను టార్గెట్ చేస్తూ దూసుకెళ్తుంది.
ఈ నేపథ్యంలోనే విశాల్ సరసన నటించడానికి కూడా సమంత ఒప్పుకుందని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. కొద్ది రోజులుగా విజయం విశాల్ ముఖంవైపు కన్నెత్తి చూడడం లేదు... దాంతో ఈ సారి ఎలాగైనా ఓ మంచి సబ్జెక్ట్‌తో జనాన్ని ఆకట్టుకోవాలని విశాల్ అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నాడు. ఆ ప్రయత్నంలో భాగంగానే తనకు ఎంతో పేరు సంపాదించి పెట్టిన 'పందెంకోడి'కి సీక్వెల్ నిర్మించాలని యోచిస్తున్నాడు విశాల్.
ఈ చిత్రంలోనే తన సరసన నాయికగా సమంతను ఎంపిక చేసుకోవాలని భావిస్తున్నాడు. విశాల్ 'పందెంకోడి' చిత్రానికి లింగుస్వామి దర్శకత్వం వహించగా, ఆయన దర్శకత్వంలోనే 'పందెంకోడి'కి సీక్వెల్ రూపొందించాలని విశాల్ భావిస్తున్నాడు. తాజాగా సమంతకు దర్శకుడు లింగుస్వామి కథని వినిపించాడని, కథ నచ్చడంతో 'పందెంకోడి 2'లో నటించేందుకు అంగీకరించినట్లు కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
త్వరలో ఈ 'పందెంకోడి 2' సినిమాకి సమంత డేట్స్ కేటాయించే అవకాశం ఉన్నదని ఆమె సన్నిహితులు అంటున్నారు. ఈ చిత్రంలో సమంతతో పాటు నిత్యా మీనన్ కూడా ఓ నాయికగా నటించనుందట. ఈ సారి విశాల్ 'పందెంకోడి' సీక్వెల్‌లో సమంత, నిత్యా మీనన్ కలసి నటించబోతున్నారు. మరి ఈ సినిమా విశాల్‌కు ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి.