Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రియురాలి లులియాతో ''పెళ్లి కాలేదు.. అదీ కాలేదు'' : సల్మాన్ ఖాన్

కొద్దికాలంగా మీడియాలో బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ పెళ్లి గురించి ఒకటే చర్చ. సల్మాన్ తన ప్రియురాలు లులియా వంటర్‌ని ఎప్పుడు పెళ్లాడాతాడు? ఇప్పటికే పెళ్లైందా? అంటూ అనేక సందేహాలు బాలీవుడ్‌లో చక్కర్లు

ప్రియురాలి లులియాతో ''పెళ్లి కాలేదు.. అదీ కాలేదు'' : సల్మాన్ ఖాన్
, శుక్రవారం, 16 సెప్టెంబరు 2016 (16:25 IST)
కొద్దికాలంగా మీడియాలో బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ పెళ్లి గురించి ఒకటే చర్చ. సల్మాన్ తన ప్రియురాలు
లులియా వంటర్‌ని ఎప్పుడు పెళ్లాడాతాడు? ఇప్పటికే పెళ్లైందా? అంటూ అనేక సందేహాలు బాలీవుడ్‌లో చక్కర్లు కొట్టాయి. దీనిపై సల్మాన్ మాట్లాడుతూ ''పెళ్లి కాలేదు.. అదీ కాలేదు'' అని కూడా అన్నాడు. అయితే, సల్మాన్ చెప్పిన మాటలు అబద్ధమని, సల్మాన్‌కి, లులియాకి ఇప్పటికే పెళ్లైంది అంటూ కొన్ని వార్తలు వెలువడ్డాయి. అయితే, ఎప్పుడూ సల్మాన్‌తోనే ఉండడం, పార్టీలకు ఫంక్షన్లకు సల్మాన్‌తో కలిసి హాజరవడం, సల్మాన్ కుటుంబసభ్యులతో కలిసి పోవడం చూస్తే ఈ జంటకు నిజంగా పెళ్లైందా అనే అనుమానాలు కలగకుండా మానదు.
 
నిజానికి బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ పెళ్లి గురించి ఆయన అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు పెళ్లి టాపిక్ వచ్చిన దాటవేసే ఈ ముదురు బ్యాచిలర్ ఎట్టకేలకు తన పెళ్లి నవంబర్ 18న ఉంటుందని ప్రకటించాడు. కానీ అది ఏ సంవత్సరమన్నది మాత్రం చెప్పలేదు. కాగా ఈ హీరోగారి పెళ్లి వ్యవహారం ఇప్పుడు మరోసారి తెరమీదికొచ్చింది. రొమానియన్‌ సుందరి యులియా వంతూర్‌తో పెళ్లిపీటలెక్కేందుకు ఈ కండల వీరుడు సన్నాహాలు చేసుకుంటున్నాడని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దానికోసం నివాసాన్ని మరోచోటుకి మార్చుతున్నాడట సల్మాన్‌. 
 
ముంబైలోని బాంద్రాలో ఉన్న గెలాక్సీ అపార్ట్‌మెంట్స్‌లో సల్మాన్‌ ఉంటున్నారు. ఆ అపార్ట్‌మెంట్‌లోనే వేర్వేరు ఫ్లాట్లలో అతని తల్లిదండ్రులు, సవతి తల్లి కూడా ఉంటున్నారు. అయితే.. ఇప్పుడు మరో చోటుకి మకాం మార్చేందుకు సల్లూ భాయ్ ఏర్పాట్లు చేసుకుంటున్నాడని సన్నిహిత వర్గాలు అంటున్నాయి. నిజానికి యులియాని పెళ్లి చేసుకుని వేరు కాపురం పెట్టేందుకే సల్లూభాయ్‌ ఇల్లు మారుతున్నారని బీటౌన్‌లో టాక్‌ వినబడుతోంది. మరి అది నిజమో కాదో తెలియాలంటే సల్మాన్‌ చెప్పినట్లు నవంబర్‌ వరకు ఆగాల్సిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాబోయ్ బిగ్ బి కోడలు ఐష్ రెచ్చిపోయింది... #Bulleya బుగ్గ నాకేసింది(Video)