Publish Date: Thu, 19 May 2016 (10:58 IST)
Updated Date: Thu, 19 May 2016 (11:00 IST)
బాలీవుడ్ ముదురు 'బ్రహ్మచారి' సల్మాన్‌ఖాన్ ఎట్టకేలకు పెళ్లి చేసుకోవడానికి నిర్ణయించుకున్నాడు. తను ప్రేమించిన లులియా వంటూర్‌ను ఆయన పెళ్లాడబోతున్నాడు. తన తల్లికి కోరిక మేరకు ఈ బ్రహ్మచారి ఓ ఇంటివాడు కాబోతున్నాడు. కాగా సల్మాన్ ఖాన్ పెళ్లి తేదీని కూడా కుటుంబసభ్యులు ఖరారు చేశారు.
వచ్చే డిసెంబర్ 27, 2016న బ్రహ్మచర్యానికి స్వస్తి చెప్పనున్నాడు. మరోవైపు సల్మాన్-లులియా జంటగా కనిపిస్తున్న ఫొటోలు సోషియల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ప్రీతి జింటా వెడ్డింగ్ రిసెప్షన్‌కి ఈ ప్రేమజంట కలిసి వెళ్లి తొలిసారి పబ్లిక్‌కు కనిపించిన సంగతి తెలిసిందే.