Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కపిల్ దేవ్ జీవిత చరిత్ర ఆధారంగా సల్మాన్ ఖాన్ చిత్రం... కబీర్ ఖాన్ దర్శకత్వంలో....

ఈ మధ్యకాలంలో వస్తున్న బాలీవుడ్ సినిమాలు చూస్తున్నారా…? కొత్త ట్రెండ్ ఏమిటో కనిపెట్టారా…? అదేనండీ… స్పోర్ట్స్ నేపథ్యంలో సినిమాలు తీస్తున్నారు.. అవి కూడా మంచి హిట్ పిక్చర్లుగా నిలుస్తున్నాయి. ఇండియా పేర

కపిల్ దేవ్ జీవిత చరిత్ర ఆధారంగా సల్మాన్ ఖాన్ చిత్రం... కబీర్ ఖాన్ దర్శకత్వంలో....
, మంగళవారం, 18 అక్టోబరు 2016 (13:18 IST)
ఈ మధ్యకాలంలో వస్తున్న బాలీవుడ్ సినిమాలు చూస్తున్నారా…? కొత్త ట్రెండ్ ఏమిటో కనిపెట్టారా…? అదేనండీ… స్పోర్ట్స్ నేపథ్యంలో సినిమాలు తీస్తున్నారు.. అవి కూడా మంచి హిట్ పిక్చర్లుగా నిలుస్తున్నాయి. ఇండియా పేరును అంతర్జాతీయ స్థాయిలో మారుమోగించిన క్రీడాకారుల జీవిత చరిత్రల ఆధారంగా సినిమాలు తీయడం ఇటీవల కాలంలో ట్రెండ్‌గా మారింది.. అంతేకాదు, ఆ ట్రెండ్ ఇంకా కొనసాగుతుంది. ఫ్లయింగ్ సిక్‌గా పేరున్న ఒలింపిక్ రన్నర్ జీవితకథతో ఫరాన్ అక్తర్ తీసిన ''భాగ్ మిల్కా భాగ్'' ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ఆ సినిమా రూ.100 కోట్లకు పైగా వసూళ్ల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే.
 
ఆ తర్వాత లేడీ పంచ్ మాస్టర్ మేరీ కోమ్ జీవితం, ఆధారంగా తెరకెక్కించిన సినిమా కూడా సూపర్ హిట్‌గా నిలిచింది. దీంతో ఈ తరహా సినిమాల నిర్మాణంలో బాలీవుడ్ దర్శకులు బిజీగా మారుతున్నారు. ప్రసిద్ధ క్రీడాకారుల జీవితాలను తెరకెక్కించేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. అలాగే నీరజ్ పాండే దర్శకత్వంలో టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై తీసిన ''ఎంఎస్ ధోనీ.. ది అన్ టోల్డ్ స్టోరీ'' సినిమా విడుదలై కాసుల వర్షం కురిపించింది. 
 
ఈ ట్రెండ్‌ను క్యాష్ చేసుకునేందుకు క్రీడాకారులపై సినిమాలు తీసేందుకు బాలీవుడ్ దర్శకులు, నిర్మాతలు ఉవ్విళ్లూరుతున్నట్లే కొందరు ఆటగాళ్లూ తమ కథలను వెండితెరపై చూసుకోవాలని ఉబలాటపడుతున్నారు. తాజాగా సచిన్ టెండూల్కర్ బయోపిక్ కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో భారత్‌కు తొలి ప్రపంచకప్‌ను అందించిన కెప్టెన్, మన దేశం నుంచి పుట్టుకొచ్చిన తొలి తరం ఫాస్ట్ బౌలర్, ఆల్ టైం గ్రేట్ క్రికెటర్ అయిన కపిల్ దేవ్ జీవిత చరిత్రను తెరకెక్కించడానికి సన్నహాలు జరుగుతున్నాయి. 
 
ఈ సినిమాలో కపిల్ పాత్రను బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ పోషిస్తాడనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. ప్రస్తుతం 'ట్యూబ్ లైట్' సినిమాలో సల్లూభాయ్ బిజబిజీగా ఉన్నాడు. ఈ సినిమాకు కబీర్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన వెంటనే... కబీర్ ఖాన్ దర్శకత్వంలోనే కపిల్ బయోపిక్ కూడా తెరకెక్కనుందని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అబ్బా.. రానాతో సమ్మూ రొమాన్స్ పండించిందే.. బెంగళూరు డేస్ రీమేక్‌లో.. ఫోటో చూడండి..