Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సల్మాన్ ఖాన్‌కు అరుదైన రికార్డు... రూ.100 కోట్ల క్లబ్‌లో సినిమాలు.. కానీ భయంకరమైన వ్యాధితో?

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ భారతీయ సినిమా చరిత్రలో ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. ఇటీవల కాలంలో తాను నటించిన అన్నిచిత్రాలను వరుసగా వంద కోట్ల క్లబ్‌లో చేర్చిన ఏకైక బాలీవుడ్ నటుడిగా సల్మాన

Advertiesment
సల్మాన్ ఖాన్‌కు అరుదైన రికార్డు... రూ.100 కోట్ల క్లబ్‌లో సినిమాలు.. కానీ భయంకరమైన వ్యాధితో?
, మంగళవారం, 20 సెప్టెంబరు 2016 (17:04 IST)
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ భారతీయ సినిమా చరిత్రలో ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. ఇటీవల కాలంలో తాను నటించిన అన్నిచిత్రాలను వరుసగా వంద కోట్ల క్లబ్‌లో చేర్చిన ఏకైక బాలీవుడ్ నటుడిగా సల్మాన్ ఖాన్ నిలిచాడు. కండల వీరుడిగా సల్మాన్ ఖాన్‌కి బాలీవుడ్‌లో విపరీతమైన క్రేజ్ ఉంది. అన్నివర్గాల ప్రేక్షకులను తన నటనతో ఆకట్టుకుంటున్న ఏకైక హీరో సల్లూ భాయ్. 
 
అలాంటి సల్మాన్ 'ట్రైజెమినల్ న్యూరల్జియా' అనే వ్యాధితో బాధపడుతున్నాడట. ఈ కండలవీరుడు సల్మాన్‌ 50 ఏళ్ల వయసులోనూ ఫిట్‌నెస్‌ని కాపాడుకోవడానికి ఎన్నో కసరత్తులు చేస్తుంటాడు. సల్లూ ఎంత బిజీగా ఉన్నా తన డైట్‌ని చక్కగా అనుసరిస్తాడు. అలాంటి సల్లూభాయ్‌ కొన్ని సంవత్సరాలుగా ఈ భయంకరమైన వ్యాధితో బాధపడుతున్నాడట. 2007లో 'పార్ట్ నర్' సినిమా షూటింగ్ సమయంలో ఈ వ్యాధి బయటపడిందట. దాంతో భాయ్‌ వైద్యులను సంప్రదిస్తే ఈ వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిపారు. ఈ వ్యాధి వచ్చినప్పుడు ముందు దవడ భాగంలో తీవ్ర నొప్పి ఉంటుందట. 
 
అనంతరం నిదానంగా మెదడుపై ప్రభావం చూపుతుంది. ఈ విషయం తెలిసి సల్మాన్‌  ఇంట్లో వారికి కూడా ఈ విషయం చెప్పకుండా అమెరికాలో చికిత్స చేయించుకున్నాడు.  ట్రీట్‌మెంట్‌ పూర్తికాగానే సరిగ్గా విశ్రాంతి తీసుకోకుండా వెంటనే భారత్‌ వచ్చి షూటింగ్‌లో పాల్గొన్నాడట. ఈ వ్యాధి కారణంగా భాయ్‌ క్రమం తప్పకుండా చెకప్‌లు చేయించుకుంటున్నాడు. ఇప్పటికీ క్రమం తప్పకుండా చెకప్ చేయించుకుంటూ ఉంటున్నాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డైరెక్టర్ మణిరత్నంకు ఇండియన్ ఆర్మీ వార్నింగ్...?