Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రూటు మార్చిన ఆర్ఎక్స్ 100 డైరెక్ట‌ర్..!

ఆర్ఎక్స్ 100.. చిన్న సినిమాగా రూపొందిన ఈ సినిమా ఎంత పెద్ద విజ‌యాన్ని సొంతం చేసుకుందో తెలిసిందే. దీంతో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించిన అజ‌య్ భూప‌తికి బ‌డా సంస్థల నుంచి భారీ ఆఫ‌ర్స్ వ‌చ్చాయి. యంగ్ హీరోలు అజ‌య్‌తో సినిమా చేసేందుకు క్యూకడుతున్నారు. అజ‌య్ నెక

Advertiesment
రూటు మార్చిన ఆర్ఎక్స్ 100 డైరెక్ట‌ర్..!
, శనివారం, 29 సెప్టెంబరు 2018 (20:50 IST)
ఆర్ఎక్స్ 100.. చిన్న సినిమాగా రూపొందిన ఈ సినిమా ఎంత పెద్ద విజ‌యాన్ని సొంతం చేసుకుందో తెలిసిందే. దీంతో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించిన అజ‌య్ భూప‌తికి బ‌డా సంస్థల నుంచి భారీ ఆఫ‌ర్స్ వ‌చ్చాయి. యంగ్ హీరోలు అజ‌య్‌తో సినిమా చేసేందుకు క్యూకడుతున్నారు. అజ‌య్ నెక్ట్స్ మూవీని ఎవ‌రితో చేయ‌నున్నాడ‌నే ఆస‌క్తి ఏర్ప‌డింది. అయితే... రామ్ - దుల్క‌ర్ స‌ల్మాన్ కాంబినేష‌న్‌లో సినిమా చేయ‌నున్నాడు అనే వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. 
 
రామ్‌కి క‌థ చెప్పాడు. దుల్క‌ర్ స‌ల్మాన్‌కి క‌థ చెప్పి ఒప్పిస్తే సినిమా సెట్స్ పైకి వెళుతుంది. త్వ‌ర‌లోనే సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉంద‌ని టాక్ వినిపించింది. కానీ.. తాజా వార్త ఏంటంటే.. రామ్ - దుల్క‌ర్ స‌ల్మాన్‌తో చేయాల‌నుకున్న మ‌ల్టీస్టార‌ర్‌ని ప‌క్క‌న పెట్టేసాడ‌ట‌. యువ హీరో నితిన్‌తో సినిమా చేయాల‌నుకుంటున్నాడ‌ట‌. 
 
ఇటీవ‌ల నితిన్‌కి క‌థ చెప్ప‌డం.. ఓకే అన‌డం జ‌రిగింద‌ని టాక్. ఈ చిత్రాన్ని భ‌వ్య క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పైన ఆనంద్ ప్ర‌సాద్ నిర్మించాల‌నుకుంటున్నార‌ట‌. త్వ‌ర‌లోనే అఫిషియ‌ల్‌గా ఎనౌన్స్ చేస్తార‌ని స‌మాచారం. మ‌రి.. స‌రైన స‌క్స‌స్ కోసం ఎదురు చూస్తోన్న నితిన్‌కి అజ‌య్ అయినా విజ‌యాన్ని అందిస్తాడో లేదో చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చిరంజీవి టైటిల్‌తో వ‌స్తోన్న‌ క‌మెడియ‌న్ మూవీ..!