Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

టీషర్టులు దొంగతనం చేసిన మాజీ సీఎం కొడుకు

Advertiesment
Riteish Deshmukh
బాలీవుడ్ హీరో రితేశ్‌దేశ్‌ముఖ్‌ ట్రూబ్లూ షాపులో దుస్తులు దొంగిలిస్తూ సీసీటీవీ కెమెరాకు చిక్కుకున్నాడు. మాజీ సీఎం కొడుకు, మాజీ హీరోయిన్ జెనీలియా భర్త ఈయనకు దొంగతనం చేయాల్సిన కర్మేంటి అనుకుంటున్నారా.... అసలు విషయమేంటో తెలియదు కానీ... ఓ దుస్తుల దుకాణంలో దొంగతనం చేశాడు. ఆ ఉదంతం మొత్తం సీసీటీవీలో రికార్డు అయ్యింది. 


ముంబయిలోని ఓ షాపింగ్‌మాల్‌లోని ట్రూబ్లూ బ్రాండ్ బట్టల షాపులో కొన్ని దుస్తులను ట్రై చేసిన రితేష్ దేశ్ ముఖ్...మరికొన్ని టీషర్టులను టీషర్టులోపల పెట్టుకోవడం సీసీ పుటేజ్‌లో స్పష్టంగా కనిపించింది. సీసీ టీవీ ఫుటేజీలో రికార్డయిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.


నిజం వీడియోనేనా అని ఆరాలు తీస్తున్నారు. రితేష్ ఎందుకిలా చేశాడని అభిమానులు తలబద్దలు కొట్టుకుంటున్నారు. బాలీవుడ్ ప్రముఖులకైతే ఈ విషయంపై ఎలా స్పందించాలో అర్ధం కావడం లేదు. ఇంతకీ ఇది దొంగతనమా? అయితే రితేష్ తాజా చిత్రం ''హౌస్ ఫుల్ 3'' ప్రచారం కోసమే ముందుగా ఈ వీడియోను విడుదల చేశారని కొందరు అంటుంటే... మరికొందరు ట్రూబ్లూ అనే టీషర్టుల బ్రాండ్ ప్రచారం కోసమని మరికొందరంటున్నారు. ఏది ఏమైనా సోషల్ మీడియాలో మాత్రం ఆ వీడియో మాత్రం వైరల్‌ అవుతోంది.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చిరంజీవి 'కత్తిలాంటోడు'లో బన్నీ.. కలెక్షన్ల కోసమేనా... పబ్లిసిటీ కోసమా?