Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Vijay and Rashmika: విజయ్ దేవరకొండ, రష్మికల వివాహం ఎప్పుడో తెలుసా?

Advertiesment
Rashmika_Vijay

సెల్వి

, గురువారం, 6 నవంబరు 2025 (20:56 IST)
Rashmika_Vijay
టాలీవుడ్ ప్రేమ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న అక్టోబర్‌లో నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. అక్టోబర్‌లో వీరిద్దరూ ఒక ప్రైవేట్ వేడుకలో నిశ్చితార్థం చేసుకున్నారని, దగ్గరి కుటుంబ సభ్యులు, స్నేహితులు మాత్రమే ఈ వేడుకకు హాజరయ్యారని తెలుస్తోంది. 
 
తన ది గర్ల్‌ఫ్రెండ్ సినిమాను ప్రమోట్ చేస్తున్నప్పుడు, రష్మిక సిగ్గుపడుతూ తన నిశ్చితార్థపు ఉంగరాన్ని ప్రదర్శిస్తూ కనిపించింది. అయితే వీరి పెళ్లి భాజాలు ఎప్పుడు మోగుతాయని అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. 
 
ఇలాంటి పరిస్థితుల్లో ఫిబ్రవరి 26, 2026న ఉదయపూర్‌లోని ఒక అందమైన ప్యాలెస్‌లో వివాహం జరుగుతుందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే రష్మిక లేదా విజయ్ ఇంకా దీనిని ధృవీకరించలేదు. ప్రస్తుతానికి వారు వృత్తిపరంగా బిజీబిజీగా వున్నారు.
 
రష్మిక ఈ ఏడాది చావా, సికందర్, కుబేరా, థమ్మా చిత్రాల్లో నటించింది. ఆమె తదుపరి సినిమా ది గర్ల్‌ఫ్రెండ్, నవంబర్ 7, 2025న థియేటర్లలోకి వస్తుంది. ఇంకా కాక్‌టెయిల్ 2, మైసా చిత్రాలలో కూడా రష్మిక లేడి ఓరియెంటెడ్ పాత్రల్లో కనిపిస్తోంది. ఇక విజయ్, కింగ్ డమ్ ద్వారా పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. 
 
అది బాక్సాఫీస్ వద్ద విఫలమైంది, కానీ అతను రౌడీ జనార్ధనతో కీర్తి సురేష్‌తో కలిసి నటిస్తున్నాడు. దర్శకుడు రవి కిరణ్ కోలాతో కలిసి మరో చిత్రంలోనూ కనిపించబోతున్నాడు. ఇక పెళ్లి వార్తలపై విజయ్ లేదా రష్మిక ఎలా స్పందిస్తారో చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Kajal Aggarwal: ఆస్ట్రేలియాలో భర్తతో టాలీవుడ్ చందమామ.. ఫోటోలు వైరల్