Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పవన్‌కు రేణూ దేశాయ్ బ్రేకప్ ఇవ్వడానికి కారణం అదేనా? ఆద్య పట్ల పవన్ ఎందుకు మాట్లాడట్లేదు?

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ నుంచి దూరమైన ఆయన భార్య రేణూ దేశాయ్.. ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంది. పూణేలో ఉంటూ సినీ నిర్మాతగా, అకీరా ఆద్యలను పెంచుకుంటోంది. అప్పట్లో పవన్ కల్యాణ్ క

పవన్‌కు రేణూ దేశాయ్ బ్రేకప్ ఇవ్వడానికి కారణం అదేనా? ఆద్య పట్ల పవన్ ఎందుకు మాట్లాడట్లేదు?
, గురువారం, 3 నవంబరు 2016 (13:05 IST)
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ నుంచి దూరమైన ఆయన భార్య రేణూ దేశాయ్.. ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంది. పూణేలో ఉంటూ సినీ నిర్మాతగా, అకీరా ఆద్యలను పెంచుకుంటోంది. అప్పట్లో పవన్ కల్యాణ్ కెరీర్‌లో సరైన హిట్స్ లేవు.. లైఫ్‌లో డెవలప్‌మెంట్ అంటూ ఏదీ లేదు. చప్పగా పోతున్న తన లైఫ్ తనకొద్దనుకుని రేణూ దేశాయ్ ఆయన్ని వదిలిపోయిందని అందరూ అనుకుంటున్నారు. 
 
తనను గాఢంగా ప్రేమించిన రేణూ దేశాయ్ తన నుంచి దూరమయ్యాక గబ్బర్ సింగ్ ద్వారా హిట్ కొట్టేసిన పవన్ కల్యాణ్.. ఇతరులకు మేలు చేయాలని రాజకీయాల్లోకి ఎంటరయ్యారు. అయితే పవన్ నుంచి రేణూ దేశాయ్ దూరమయ్యేందుకు అతని మంచితనం కూడా ఒక కారణమని తెలిసింది. కష్టపడే వారికి చేతుల్లో ఉన్న మేరకు దానం చేసే పవన్ కల్యాణ్ తనకంటూ డబ్బును వెనకేసుకోవట్లేదని.. మంచితనంతో బతకడంతో కష్టమని డబ్బే ప్రధానమని డబ్బుతోనే అంతా సాధ్యమని అప్పుడే హోదా ఉంటుందని భావించిన రేణూ దేశాయ్.. ఆయన్నుంచి దూరమైనట్లు సినీ జనం గుసగుసలాడుకుంటున్నారు. అందుకే ఇటీవల తిరుపతిలో జరిగిన బహిరంగ సభలో కూడా తన మూడో భార్య కుమార్తె గురించి.. ఆమె క్రిస్టియన్ అని చెప్పాడని.. రేణూ దేశాయ్ పిల్లల గురించి పవన్ మాటెత్తలేదని సినీ జనం చెవులు కొరుక్కుకుంటున్నారు. 
 
ఇంతకీ ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే..? తాజాగా ఫేస్‌బుక్‌లో రేణూ దేశాయ్ అండ్ కిడ్స్ ఫోటోలు హల్‌చల్ చేస్తున్నాయి. పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ తన కొడుకు అకీరా, ఆద్య ఫోటోలను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది. ఇందులో ప్రత్యేకత ఏంటంటే.. పవన్ కుమార్తె ఆద్య ఫోటోనే. పవన్ కుమారుడు అకీరా ఫోటోలు నెట్‌లో హల్‌చల్ చేసినా కూతురు ఆద్య ఫోటోలు మాత్రం నెట్‌లో వెతికినా కనిపించవు. 
 
ఒకవేళ దొరికినా అవి ఎప్పుడో చిన్నప్పుడు స్కూల్లో జరిగిన ఫంక్షన్‌లో దిగిన ఫోటోలు మాత్రమే. తాజాగా దీపావళి సందర్భంగా ఆమె పోస్టు చేసిన ఫోటోల్లో పిల్లలిద్దరూ పెరిగారు. అకీరా కూడా టీనేజ్ వయసులోకి అడుగుపెట్టినట్లు ఫోటోలను చూస్తే స్పష్టంగా తెలుస్తోంది. ఈ ఫోటోలకు సోషల్ మీడియాలో లైకులు వెల్లువెత్తుతున్నాయి. ఇంకా పవన్ కల్యాణ్ అన్నయ్యతో కలిసుండాల్సిందిగా ఆయన ఫ్యాన్స్ రేణూ దేశాయ్‌ని ఫేస్ బుక్ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు. మరి రేణూ దేశాయ్ పవన్‌తో మళ్లీ కలిసుండటంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియాలంటే వేచి చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చెర్రీ సరసన రాశీ ఖన్నా.. సుకుమార్ సినిమాలో హీరోయిన్.. పల్లెటూరి అమ్మాయిగా?