Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చెర్రీ సరసన రాశీ ఖన్నా.. సుకుమార్ సినిమాలో హీరోయిన్.. పల్లెటూరి అమ్మాయిగా?

అందాల తార రాశీ ఖన్నా లక్కీ ఛాన్స్ కొట్టేసింది. అందంతో పాటు అభినయంతో ఆకట్టుకునే ఈ హీరోయిన్‌కు లక్కీ ఛాన్సులు మాత్రం అందని ద్రాక్ష పండ్లులా మిగిలిపోయాయి. ఊహలు గుసగుసలాడే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ బొద్దుగ

చెర్రీ సరసన రాశీ ఖన్నా.. సుకుమార్ సినిమాలో హీరోయిన్.. పల్లెటూరి అమ్మాయిగా?
, గురువారం, 3 నవంబరు 2016 (12:29 IST)
అందాల తార రాశీ ఖన్నా లక్కీ ఛాన్స్ కొట్టేసింది. అందంతో పాటు అభినయంతో ఆకట్టుకునే ఈ హీరోయిన్‌కు లక్కీ ఛాన్సులు మాత్రం అందని ద్రాక్ష పండ్లులా మిగిలిపోయాయి. ఊహలు గుసగుసలాడే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ బొద్దుగుమ్మ, తరువాత యంగ్ హీరోలతో వరుస సినిమాలతో చేస్తూ బిజీ హీరోయిన్‌గా మారింది. కెరీర్‌లో మంచి సక్సెస్‌లు సాధించినా.. స్టార్ హీరోల సరసన ఛాన్స్ మాత్రం రాలేదు. 
 
తాజాగా ఈ ముద్దుగుమ్మకు మెగా ఆఫర్ తలుపు తట్టింది. ధృవ సినిమాలో నటిస్తున్న రామ్ చరణ్.. ఈ సినిమా తర్వాత సుకుమార్ దర్శకత్వంలో ఓ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ చేయనున్నాడు. విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కనున్న ఈ పీరియాడిక్ డ్రామా కోసం రాశీఖన్నాను హీరోయిన్‌గా ఖరారు చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో రాశీ ఖన్నా పల్లెటూరి అమ్మాయిలా లంగావోణీలో ప్రేక్షకులను ఆకట్టుకోనుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

షారూఖ్ ఖాన్‌తో కలిసి నటించాలనుంది.. కానీ ఆయన అలా అనుకోవాలి కదా?: సోనమ్ కపూర్