Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అది రాజమౌళికే చెల్లుతోంది... క్రిష్‌కు అంతైతే సరిపోతుందట...

కెప్టెన్‌ ఆఫ్‌ది షిప్‌.. అంటూ సినిమాకు దర్శకుడిని పోలుస్తారు. అందుకే డిమాండ్‌ సప్లై సూత్రం అన్ని రంగాలకు వర్తించినట్లే.. దర్శకులకూ వర్తిస్తుంది. అనధికార లెక్కల ప్రకారం.. తెలుగులో అత్యధిక పారితోషికం తీసుకునే దర్శకుడు రాజమౌళి. ఆయనకు 20 కోట్లు అంటున్నార

Advertiesment
Remunarations to tollywood directors
కెప్టెన్‌ ఆఫ్‌ది షిప్‌.. అంటూ సినిమాకు దర్శకుడిని పోలుస్తారు. అందుకే డిమాండ్‌ సప్లై సూత్రం అన్ని రంగాలకు వర్తించినట్లే.. దర్శకులకూ వర్తిస్తుంది. అనధికార లెక్కల ప్రకారం.. తెలుగులో అత్యధిక పారితోషికం తీసుకునే దర్శకుడు రాజమౌళి. ఆయనకు 20 కోట్లు అంటున్నారు. తర్వాత త్రివిక్రమ్‌ది. 12 కోట్లు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. 3వ స్థానంలో బోయపాటి శ్రీను. 10 కోట్లు. వినాయక్‌కు 8 కోట్లు, సురేందర్‌ రెడ్డి, సుకుమార్‌, పూరీలు 6 కోట్లకు చేరారు. గౌతమీపుత్ర శాతకర్ణి దర్శకుడు క్రిష్‌ 4 కోట్లు ఇస్తే సరిపోతుందట. 
 
ఇక శ్రీనువైట్ల ఒక్కసారిగా పడిపోయాడు. ఒక దశలో మహేష్‌ సినిమా చేస్తుండగా 10 కోట్లు తీసుకునే తను ఇప్పుడు నిర్మాత ఇష్టప్రకారమే తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. కొరటాల శివకు 10 కోట్లు ఇవ్వడానికి సిద్ధమయినట్లు సమాచారం. బ్యానర్లు, హీరోలు, బడ్జెట్‌ను బట్టి.. దర్శకులు డిమాండ్‌ చేయడం పరిపాటి. సినిమాకు ముందుగానే బడ్జెట్‌ వేసి.. ప్లాన్‌ ప్రకారమే చేస్తూ అత్యధిక పారితోషికం తీసుకునే దాసరి, రాఘవేంద్రరావులకే చెల్లింది. ఇప్పుడు అది రాజమౌళికే దక్కింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శివరాత్రి స్పెషల్ ఫర్ మెగా ఫ్యాన్స్.. విన్నర్‌గా తేజ్.. అదే రోజున బన్నీ డీజే ట్రైలర్ రిలీజ్..