రెజీనాకు ఎంగేజ్‌మెంట్ అయిపోయిందట.. సినిమా స్టంటా.. నిజంగానే రింగ్ మార్చేసుకుందా?
రెజీనాపై ఇప్పటిదాకా మెగా హీరోతో లింకు పెట్టి రూమర్స్ వచ్చేవి. ఎస్సెమ్మెస్ సినిమా ద్వారా తెరపైకి వచ్చిన రెజీనా.. అగ్ర హీరోయిన్‌గా ఎదిగింది. చురుగ్గా వుండే ఈ ముద్దుగుమ్మ.. తెలుగుతోపాటు తమిళంలోనూ సినిమాల
రెజీనాపై ఇప్పటిదాకా మెగా హీరోతో లింకు పెట్టి రూమర్స్ వచ్చేవి. ఎస్సెమ్మెస్ సినిమా ద్వారా తెరపైకి వచ్చిన రెజీనా.. అగ్ర హీరోయిన్‌గా ఎదిగింది. చురుగ్గా వుండే ఈ ముద్దుగుమ్మ.. తెలుగుతోపాటు తమిళంలోనూ సినిమాలు చేయాలన్న ప్లాన్‌తో ఉందట. నాలుగు సినిమాల్లో నటిస్తూ పోస్టర్లలో కనిపిస్తున్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకునే పనిలో పడిందట.
ఈ నేపథ్యంలో తనకు ఎంగేజ్‌మెంట్ జరిగిందంటూ రెజీనా స్వయంగా తెలియజేసిందట. ఫ్యామిలీ మెంబర్ల మధ్య ఈ వేడుక జరిగిందని చెబుతూ రింగ్స్ మార్చుకున్న చేతులను మాత్రమే పోస్ట్ చేసిందట రెజీనా. అయితే ఇదంతా తన సినిమా ప్రచారం కోసమేనని.. అవన్నీ ఫేక్ వార్తలని ఫ్యాన్స్ అంటున్నారట.
ఇదిలా ఉంటే.. గోవిందుడు అందరివాడేలే సినిమాకు తర్వాత కృష్ణ వంశీ భారీ బడ్జెట్ సినిమా తీస్తున్నారు. నక్షత్రం అనే పేరిట ఈ సినిమా తెరకెక్కుకోంది. ఈ సినిమాలో రెజీనా గెటపే ప్రస్తుతం టాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. ఈ సినిమాలో రెజీనా జూనియర్ ఆర్టిస్టు రోల్ పోషిస్తున్నట్లు తెలిసింది. జమునారాణి అనే ఆమె పాత్ర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుందని సినీ యూనిట్ అంటోంది. ఈ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌కు ఇప్పటికే మంచి క్రేజ్ వచ్చింది.
ఇంకా సక్సెస్ లేకపోయినా అవకాశాలు రావడంతో అమ్మడు పారితోషికం కూడా పెంచేసిందని టాక్. బాలీవుడ్ లో ఛాన్స్ రావడం వల్లే 'రెజీనా' రెమ్యూనేషన్ పెంచినట్లు వినిపిస్తోంది. ఇప్పటి వరకు రూ.60 లక్షల రెమ్యూనేషన్ తీసుకున్న ఈ చెన్నై పిల్ల ఇక నుంచి రూ. కోటి 50 లక్షలకు ఏ మాత్రం తగ్గేది లేదని చెప్పుతోందట.
కృష్ణవంశీ 'నక్షత్రం' సినిమాలో నటిస్తున్న ఈ బ్యూటీ 'అవసరాల శ్రీనివాస్' దర్శకత్వం వహిస్తున్న 'జ్యో అచ్యుతానంద' మూవీలో హీరోయిన్‌గా చేసింది. ఇక తమిళంలోనూ 'మా నగరం' అనే సినిమా చేస్తోంది. బాలీవుడ్‌లో ఆంఖే2లో నటించే ఛాన్స్ కొట్టేసింది.