Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చిరంజీవి 150వ చిత్రం ముహుర్తం ఖరారు.. 29వ తేదీ మధ్యాహ్నం 1.30 గంటలకు...

Advertiesment
Reason
మెగా అభిమానులకు శుభవార్త. మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాకి ముహూర్తం ఖరారైంది. మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మధురక్షణం రానే వచ్చింది. ఈనెల 29వ తేదీన మధ్యాహ్నం 1:30 గంటలకి ఈ సినిమా ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఈ నెల 29వ తేదీ తర్వాత రాబోయే రోజుల్లో మంచి ముహుర్తాలు లేవన్న కారణంగానే చిరు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. తమిళంలో విజయం సాధించిన కత్తి రీమేక్‌లో చిరంజీవి నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి వి.వి.వినాయక్ దర్శకత్వం వహించనున్నాడు. 
 
ఈ సినిమాకు ''కత్తిలాంటోడు'' అనే టైటిల్‌ని ఖరారు చేసినట్టు సమాచారం. ముఖ్యంగా ఈ కథ మీద వివాదం చెలరేగడంతో కొంతకాలం ఈ సినిమా చర్చకి వాయిదా పడింది. అయితే వి.వి.వినాయక్ ఇవేమి పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూపోయాడట. ఈ సినిమా కథను తెలుగుపరిశ్రమకు అనుగుణంగా స్క్రిప్టుని తీర్చిదిద్ది చిరంజీవికి వినిపించాడట. స్క్రిప్టు విన్న చిరంజీవి తెగ సంబరపడిపోయాడట, వెంటనే వినాయక్‌ని గట్టిగా కౌగిలించుకున్నాడట. ఈ చిత్రానికి రాం చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఇక షూటింగ్ మొదలుపెట్టడమే తరువాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మే 6న హైదరాబాదులో బ్రహ్మోత్సవం ఆడియో: మే20న సినిమా రిలీజ్!