Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

"నేనింతే" అంటోన్న ఆంధ్ర అమితాబ్

టాలీవుడ్‌లో "మాస్ మహారాజ్‌"గా పేరు తెచ్చుకున్న "రవితేజ" సినీ హీరోగా 20 సంవత్సరాలు పూర్తిచేసుకుంటున్నారు. కొన్నేళ్ల పాటు ఇతగాడి సినిమాలు ఎవ్వరికీ పోటీలేనట్టు ఎడాపెడా హిట్లయ్యాయి. కానీ గత కొంత కాలంగా సినిమాలు చేయడంలో స్పీడు తగ్గించేసాడు. చివరగా 2016 సం

Advertiesment
Raviteja
, శుక్రవారం, 16 జూన్ 2017 (16:50 IST)
టాలీవుడ్‌లో "మాస్ మహారాజ్‌"గా పేరు తెచ్చుకున్న "రవితేజ" సినీ హీరోగా 20 సంవత్సరాలు పూర్తిచేసుకుంటున్నారు. కొన్నేళ్ల పాటు ఇతగాడి సినిమాలు ఎవ్వరికీ పోటీలేనట్టు ఎడాపెడా హిట్లయ్యాయి. కానీ గత కొంత కాలంగా సినిమాలు చేయడంలో స్పీడు తగ్గించేసాడు. చివరగా 2016 సంవత్సరంలో "బెంగాల్ టైగర్"గా కనిపించాడు. ఇప్పుడు "రాజా ది గ్రేట్" అనే సినిమా చేస్తున్నాడు. 
 
రవితేజ స్పీడు తగ్గడానికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో మొదటగా వయస్సు మీద పడటం. ముఖంలో ముడతలు ఛాయలు కనబడుతుండటంతో బాగా ఇబ్బంది పడుతున్నాడు. కుర్ర హీరోలైన నాని, శర్వానంద్ లాంటి వారు మినిమమ్ గ్యారెంటీ హిట్లతో మంచి ఫామ్‌లో ఉండటంతో దర్శకనిర్మాతలు వారి వైపు మొగ్గు చూపుతున్నారు. 
 
మరోపక్క సీనియర్ అగ్ర హీరోలు చిరు, బాలయ్య, నాగ్ మరియు వెంకీ లాంటి హీరోలు వయస్సు మీద పడుతున్నా కూడా కుర్ర హీరోలతో పోటీపడుతున్నారు. వీలైతే మల్టీస్టారర్ చిత్రాలతో తన ఉనికిని చాటుకుంటూ, ఇకనైనా మంచి సినిమాతో మన ముందుకు వస్తారని ఆశిద్దాం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

12-12-2017: రజనీకాంత్ రాజకీయ ప్రవేశానికి ముహూర్తం ఖరారు..?