Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆ హీరోయిన్‌ను మార్చిమార్చి వాడేసుకుంటున్న ఆ ఇద్దరు హీరోలు?

తెలుగు చిత్ర పరిశ్రమలో చలాకీ పిల్లగా పేరొందిన హీరోయిన్ రాశీఖన్నా. ఈ పిల్లలకు సినీ ఛాన్సులు బాగానే వస్తున్నాయి. ఈ పిల్లను ఇద్దరు తెలుగు హీరోలు తెగ వాడేసుకుంటున్నారు. ఆ పిల్ల ఎవరో రాశీఖన్నా. ఈ భామకు అదృ

ఆ హీరోయిన్‌ను మార్చిమార్చి వాడేసుకుంటున్న ఆ ఇద్దరు హీరోలు?
, శనివారం, 21 జనవరి 2017 (10:02 IST)
తెలుగు చిత్ర పరిశ్రమలో చలాకీ పిల్లగా పేరొందిన హీరోయిన్ రాశీఖన్నా. ఈ పిల్లలకు సినీ ఛాన్సులు బాగానే వస్తున్నాయి. ఈ పిల్లను ఇద్దరు తెలుగు హీరోలు తెగ వాడేసుకుంటున్నారు. ఆ పిల్ల ఎవరో రాశీఖన్నా. ఈ భామకు అదృష్టం కలిసొచ్చినట్టుంది. 
 
ఇప్పటికే సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న చరణ్ సినిమాలో హీరోయిన్‌గా ఎంపికైంది. ఆ అనందంలో ఉండగానే మరో బంపర్ ఆఫర్ రాశీకి దక్కినట్టు సమాచారమ్. బాబీ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఇందులో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేయబోతున్నాడు. ఈ చిత్రం కోసం ముగ్గురు హీరోయిన్స్‌ని ఎంపిక చేసే పనిలో పడింది చిత్రబృందం. 
 
తాజాగా, ఓ హీరోయిన్‌గా రాశీఖన్నాని తీసుకొన్నట్టు తెలుస్తోంది. మిగిలిన ఇద్దరు హీరోయిన్స్ ఎవరన్నది త్వరలోనే తేలనుంది. ఈ చిత్రం ఫిబ్రవర్ 11న ప్రారంభం కానుంది. ఆ వెంటనే రెగ్యూలర్ షూటింగ్‌కి వెళ్లనున్నారు. జెడ్ స్వీడుతో సినిమాని పూర్తి చేసి ఆగస్టు 11న సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఈ చిత్రానికి సంగీతం దేవీశ్రీ ప్రసాద్. కళ్యాణ్ రామ్ నిర్మాత. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మలయాళ సూపర్ స్టార్ సరసన హిజ్రా... స్వయంగా ట్వీట్ చేసిన హీరో!