Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తల్లిదండ్రుల తర్వాత కత్రినా అంటే అమితమైన ఇష్టం : రణ్‌బీర్

బాలీవుడ్ హాటెస్ట్ అండ్ క్యూటెస్ట్ లవ్ జంటల్లో ప్రథమ స్థానంలో నిలిచిన జంట రణ్‌బీర్ కపూర్ - కత్రినాకైఫ్. 2009లో అజబ్ ప్రేమ్‌కి గజబ్ కహానీ సినిమాతో మొదలైన వీరి ప్రేమకహానీ 2016 న్యూ ఇయర్‌తో ముగిసిపోయింది.

Advertiesment
Ranbir
, మంగళవారం, 6 సెప్టెంబరు 2016 (09:47 IST)
బాలీవుడ్ హాటెస్ట్ అండ్ క్యూటెస్ట్ లవ్ జంటల్లో ప్రథమ స్థానంలో నిలిచిన జంట రణ్‌బీర్ కపూర్ - కత్రినాకైఫ్. 2009లో అజబ్ ప్రేమ్‌కి గజబ్ కహానీ సినిమాతో మొదలైన వీరి ప్రేమకహానీ 2016 న్యూ ఇయర్‌తో ముగిసిపోయింది. పెళ్ళికి నో చెప్పిందని రణ్‌బీర్ కపూర్ కత్రినాకైఫ్‌తో తెగతెంపులు చేసుకోగా ఇప్పుడు కత్రినాకైఫ్ తిరిగి రణ్‌బీర్‌తో కలవాలి అనుకున్నా కుదరడం లేదు. 
 
కానీ ఈ మధ్య కాలంలో వీరిద్దరి మధ్య మళ్లీ ప్రేమ చిగురించడం... త్వరలోనే పెళ్లి చేసుకోనున్నారని గతకొద్ది రోజులుగా వార్తలొస్తున్న విషయం తెలిసిందే. అయితే తన ప్రేయసి కత్రినా కైఫ్‌పై తనకున్న ప్రేమను ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. తన తల్లిదండ్రుల తర్వాత కత్రినాకైఫ్ అంటే చాలా ఇష్టమని తెలిపాడు. 
 
తనకు తాగే అలవాటు ఉందని, కానీ షూటింగ్‌లో తాగనని, తన కుటుంబం, కెరీర్, ప్రేయసి కోసం ఆలోచిస్తూ తనని తాను మార్చుకోవాలని అనుకుంటున్నట్లుగా తెలిపాడు. కత్రినాకైఫ్ అంత ఎంతిష్టమో తనపై ప్రేమ ఎంత ఉందో చెప్పడానికి మాటలు లేవని రణ్‌బీర్ చెప్పుకొచ్చాడు. దాంతో రణ్‌బీర్, కత్రినల పెళ్లి ఖాయం అయినట్లే అని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హాలీవుడ్‌ చిత్రంలో నటించడం ప్రత్యేక అనుభూతినిచ్చింది : దీపికా పదుకొణె