Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'ధృవ' ఫస్ట్ లుక్ రిలీజ్.. విల్లు బాణం కవర్ చేస్తూ డిజైన్...

Advertiesment
RamCharan
, గురువారం, 12 మే 2016 (11:45 IST)
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాబోతున్న సినిమా ''ధృవ''. తమిళంలో హిట్టయిన 'తని ఒరువన్' చిత్రాన్ని తెలుగులో ''ధృవ''గా రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌ పాత్రలో నటిస్తున్నాడు. దీనికోసం రామ్ చరణ్ భారీ కసరత్తులు మొదలుపెట్టాడట. ఇందులోభాగంగా రోజూ గంటల తరబడి జిమ్ ట్రైనింగుతో పాటు హార్స్ రైడింగ్, సైక్లింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. పైగా, సినిమాలో పాత్ర కోసం రామ్ చరణ్ కాస్త బరువు కూడా తగ్గాడట.
 
ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తుండగా, అరవిందస్వామి ఈ చిత్రంలో విలన్ పాత్రను పోషిస్తున్నాడు. హిప్ హాప్ తమీజా ఈ చిత్రానికి సంగీతం చేకూరుస్తుండగా అసీమ్ మిశ్రా సినిమాటోగ్రాఫర్‌గా పని చేస్తున్నారు. 'బ్రూస్ లీ' పరాజయం తర్వాత చరణ్ ఇప్పుడు ''ధృవ'' సినిమా షూటింగ్‌తో బిజీ బిజీగా ఉన్నాడు. 
 
గీతా ఆర్ట్స్ బేనర్‌లో అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ బయటకొచ్చింది. బ్లాక్ బ్యాక్ డ్రాప్‌లో బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్‌లో రామ్ చరణ్ తేజ్ కనిపిస్తున్నాడు. ''ధృవ'' టైటిల్‌ను విల్లు బాణం కవర్ చేస్తూ డిజైన్ చేశారు. ప్రస్తుతం ఈ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దసరా నటికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ ముగ్గురిని వదలని విక్రమ్‌ కుమార్‌... ఇంతకీ ఎవరా ముగ్గురు?