Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

విడాకులిచ్చేసినా.. ఆస్పత్రిలో రామరాజన్.. పక్కనుండి చూసుకుంటున్న నళిని.. అమ్మ వల్లే?

సినీ లెజెండ్ కమల్ హాసన్- నటీమణి గౌతమి బ్రేకప్‌ విషయం తెలిసిందే. అయితే రామరాజన్-నళిని జంట విడాకుల ద్వారా తెగతెంపులు చేసుకున్నా.. గుండెపోటుతో ఆస్పత్రిలో అడ్మిట్ అయిన రామరాజన్‌ను నళిని పక్కనుండి చూసుకుంట

విడాకులిచ్చేసినా.. ఆస్పత్రిలో రామరాజన్.. పక్కనుండి చూసుకుంటున్న నళిని.. అమ్మ వల్లే?
, సోమవారం, 7 నవంబరు 2016 (14:26 IST)
సినీ లెజెండ్ కమల్ హాసన్- నటీమణి గౌతమి బ్రేకప్‌ విషయం తెలిసిందే. అయితే రామరాజన్-నళిని జంట విడాకుల ద్వారా తెగతెంపులు చేసుకున్నా.. గుండెపోటుతో ఆస్పత్రిలో అడ్మిట్ అయిన రామరాజన్‌ను నళిని పక్కనుండి చూసుకుంటున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. తమిళ సినీ ఇండస్ట్రీలో తమకంటూ ఓ పేరు సంపాదించుకున్న జంట రామరాజన్-నళిని.
 
రామరాజన్ ప్రస్తుతం అన్నాడీఎంకే తరపున పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారు. తాను ప్రేమించి పెళ్లాడిన నళినితో గతంలో విభేదాల కారణంగా విడాకులు తీసుకున్న రామరాజన్‌కు గుండెపోటు రావడంతో.. ఆ సమాచారం అందుకున్న నళిని తన మాజీ భర్తను ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. అంతేగాకుండా.. పక్కనుండి చూసుకుంటున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. 
 
మరోవైపు.. అన్నాడీఎంకే పార్టీ తరపున పనిచేసిన రామరాజన్.. తమిళనాడు సీఎం జయలలిత అనారోగ్యం పాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతూవుండటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని.. దీంతో మనస్తాపానికి గురవడంతోనే రామరాజన్‌కు గుండెపోటు వచ్చిందని కొందరు అంటున్నారు. వీటిల్లో ఏది నిజమో తెలియాలంటే.. నళిని నోరు విప్పాల్సిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'కమెడియన్లు కూడా హీరోలుగా రాణించగలరు. అయితే అది ఓ లాటరీ' : అలీ వ్యాఖ్యలు