Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'కమెడియన్లు కూడా హీరోలుగా రాణించగలరు. అయితే అది ఓ లాటరీ' : అలీ వ్యాఖ్యలు

'సప్తగిరి ఎక్స్‌ప్రెస్' ఆడియో విడుదల సందర్భంగా సీనియర్ కమెడియన్ అలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా కమెడియన్లు హీరోలుగా మారడాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ మాటలు ఉన్నారు. ముఖ్యంగా.. స్టార్ కమెడియన్‌గా ఉన్న

'కమెడియన్లు కూడా హీరోలుగా రాణించగలరు. అయితే అది ఓ లాటరీ' : అలీ వ్యాఖ్యలు
, సోమవారం, 7 నవంబరు 2016 (13:59 IST)
'సప్తగిరి ఎక్స్‌ప్రెస్' ఆడియో విడుదల సందర్భంగా సీనియర్ కమెడియన్ అలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా కమెడియన్లు హీరోలుగా మారడాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ మాటలు ఉన్నారు. ముఖ్యంగా.. స్టార్ కమెడియన్‌గా ఉన్న సునీల్ హీరోగా మారాడు. ఆ తర్వాత కమెడియన్‌గా చేయడం మానేసిన విషయం తెల్సిందే.
 
ఈ నేపథ్యంలో మరో టాలీవుడ్ కమెడియన్ సప్తగిరి.. 'సప్తగిరి ఎక్స్‌ప్రెస్' పేరుతో నిర్మితమైన చిత్రంలో హీరోగా నటించాడు. ఈ చిత్రం ఆడియో ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో జరిగింది. ఇందులో అలీ హీరోలుగా మారిన కమెడియన్‌ల గురించి మాట్లాడాడు. ‘కమెడియన్లు కూడా హీరోలుగా రాణించగలరు. అయితే అది ఓ లాటరీ అని గుర్తుపెట్టుకోవాలి. లాటరీ అనేది ఒక్కసారే తగులుతుంది. అలా తగిలాక ఆ డబ్బులను జేబులో పెట్టుకుని రిలాక్స్‌ అయిపోవాలి. అంతేగానీ మళ్లీ మళ్లీ లాటరీ టిక్కెట్లు కొనగూడదు. కమెడియన్‌గానే కొనసాగాలి’ అని సప్తగిరికి సలహా ఇచ్చాడు. అయితే ఆ పక్కనే ఉన్న సునీల్‌కు కూడా ఇది పరోక్ష సూచన అనుకోవచ్చేమో అని ఫిల్మ్ నగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'కాటమరాయుడు' టైటిల్ తీసుకున్నందుకు నాకే సిగ్గుగా అనిపించింది: పవన్ కళ్యాణ్