Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'జీనత్ అమన్' తొడల అందాన్ని చూసే సినిమాలపై మక్కువ పెంచుకున్నా: రాంగోపాల్ వర్మ

'జీనత్ అమన్' తొడల అందాన్ని చూసే సినిమాలపై మక్కువ పెంచుకున్నా: రాంగోపాల్ వర్మ
, శనివారం, 28 మే 2016 (11:28 IST)
రాంగోపాల్ వర్మ.. వివాదాస్పద వ్యాఖ్యలతోనే జీవించే మనిషి. అసలు ఈ మాటల మాంత్రికుడు వివాదాస్పద వ్యాఖ్యల వెనక ఉన్న అస్సలు కారణమేంటి.... అనేది ప్రతి యొక్కరి మదిలో మెదిలే ప్రశ్న. ప్రతి విషయాలకు వర్మ తనదైన శైలిలో సమాధానం ఇస్తుంచాడు. తన ట్వీట్ల గురించి, అవి రేపే వివాదాల గురించి, జీవితం పట్ల తన దృక్పథాన్ని సినీ జర్నలిస్ట్ అనుపమా చోప్రాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. వర్మ బహిరంగంగా వెల్లడించాడు. 
 
పాపులారిటీ కోసం.. అందరి దృష్టిని నా వైపు తిప్పుకోడానికి వివాదాస్పద కామెంట్స్ చేస్తుంటానని వర్మ క్లారిటీ ఇచ్చాడు. నా ఉద్దేశం ప్రతి యొక్కరిని నవ్వించడం, రెచ్చగొట్టడం, ఎంజాయ్ చేయడమని తెలిపాడు. నా అభిప్రాయాన్ని బలంగా చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను ఆ ప్రయత్నంలో ఉండే మజాయే వేరని అన్నారు. 
 
ఇక, సెక్స్ గురించి వర్మ స్పందిస్తూ.. మహిళలకు కొన్ని ప్రత్యేకమైన లక్షణాలున్నాయి.. మగవారిని ఆకట్టుకోగల అందం, సత్తా వారికుంది. అందుకే నేను మగవారి కంటే కంటే స్త్రీలనే ఎక్కువ ఇష్టపడతానని తన మనసులోని మాటను చెప్పాడు. ఇకపోతే ''జీనత్ అమన్'' తొడలు చూసి సినిమాలంటే మక్కువ పెంచుకున్నానని వర్మ చెప్పడం విశేషం. ఎవరూ ఎవరి అభిప్రాయాల్ని మార్చలేరు. తొడలు, తుపాకులు, బ్రూస్ లీ, అమితాబ్ బచ్చన్ గళం.. ఇలా సినిమా అంటే నేను ఏర్పరుచుకున్న ఊహలు, అభిప్రాయాలు అంటూ నిర్మొహమాటంగా వర్మ పేర్కొన్నాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సింగిల్‌గా రమ్మంటే వస్తా... నిహారికతో మాత్రం రానంటే రాను.. నాగశౌర్య