Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సింగిల్‌గా రమ్మంటే వస్తా... నిహారికతో మాత్రం రానంటే రాను.. నాగశౌర్య

సింగిల్‌గా రమ్మంటే వస్తా... నిహారికతో మాత్రం రానంటే రాను.. నాగశౌర్య
, శనివారం, 28 మే 2016 (11:26 IST)
యువ కథానాయకుడిగా యూత్‌లో క్రేజ్ సంపాదించుకోవడానికి నాగశౌర్య తనవంతు ప్రయత్నాలు చేస్తున్నాడు. అందులో కొంతవరకూ విజయం సాధించాడు కూడా. ప్రస్తుతం నాగశౌర్య నటించిన చిత్రం 'ఒక మనసు' జూన్ 24న విడుదల కానుంది. నటుడిగా అరంగేట్రం చేసిన తక్కువ కాలంలోనే ఎలాంటి రూమర్‌లకు తావివ్వకుండా మంచి పేరు తెచ్చుకున్న నాగశౌర్య ఈ మధ్య తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. 
 
నాగశౌర్య సినిమా పేరు చెప్పగానే అందరికి హీరో నాగబాబు కుమార్తె 'నిహారిక' మాత్రమే గుర్తుకొస్తుంది. చివరికి మీడియా కూడా ఇది నిహారిక సినిమాగానే గుర్తిస్తుంది. నిహారిక మెగా ఫ్యామిలీ నుంచి రావడంతో సినిమా పట్ల అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అంతేకాక ఆడియో వేడుకలో మొత్తం నిహారిక మెగా వేడుకలా మారిపోయింది తప్ప…. అందులో నాగశౌర్య హీరో అని అతడి సినిమా వేడుక అని ఎక్కడా అనిపించలేడనే టాక్ ఇప్పటికే టాలీవుడ్ హల్ చల్ చేస్తుంది. 
 
ఇదిలావుంటే ఇటీవల ఓ టీవీ ఛానల్ గేమ్ షోకి నాగశౌర్యను గెస్ట్‌గా ఆహ్వానించారట. అందుకు సమాధానంగా సింగిల్‌గా రమ్మంటే వస్తాను… కానీ నిహారిక వస్తే రానని తేల్చిచెప్పాడట. దీంతో ఏమిచేయాలో తోచక ఆ గేమ్ షో నిర్వాహకులు సైలెంట్ అయి పోయినట్లు ఫిలింనగర్‌లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ధృవ కోసం కెమరామెన్‌ను మళ్లీ మార్చిన రాంచరణ్.. ఎందుకంటే...