వాడు 'ఐ లవ్ యూ' అన్నాడు... వాడి వెంటబడ్డా... రకుల్ ప్రీత్ సింగ్
సినీ తారలు తమకు ఎదురయిన ప్రేమ సంఘటనలను చెపుతుంటే భలేగా తమాషాగా, ఆశ్చర్యంగానూ ఉంటుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న నటి రకుల్ ప్రీత్ సింగ్ తనకు ఎదురయిన సంఘటనలు గురించి చెప్పుకొచ్చింది. అది కూడా ఓ జర్నలిస్టు అడిగితే గుర్తు చేసుకుంది.
సినీ తారలు తమకు ఎదురయిన ప్రేమ సంఘటనలను చెపుతుంటే భలేగా తమాషాగా, ఆశ్చర్యంగానూ ఉంటుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న నటి రకుల్ ప్రీత్ సింగ్ తనకు ఎదురయిన సంఘటనలు గురించి చెప్పుకొచ్చింది. అది కూడా ఓ జర్నలిస్టు అడిగితే గుర్తు చేసుకుంది. ఇప్పటివరకూ మీకు ఎవరయినా ఐ లవ్ యూ అని చెప్పారా అని అడిగితే... అంత ధైర్యం ఎవరికి లేదు.
ఐతే స్కూలు రోజుల్లో ఓ అబ్బాయి నావద్దకు వచ్చి రకుల్... ఐ లవ్ యూ అంటూ చెప్పాడు. అంతే వాడి వెంట పడ్డాను. నిలబెట్టి క్లాసు పీకాను. ఇప్పుడే లవ్ ఏంటి అని బాదేశాను. అంతే... అప్పట్నుంచి నాకు లవ్ యూ చెప్పాలంటే హడలిపోయేవారు. స్కూల్లో నేను చదువుల్లో టాపర్ ని. అంతేకాదు ఆటల్లో కూడా నేనే అని చెప్పిన రకుల్ ప్రేమలో మాత్రం లాస్ట్ అని కిసుక్కున నవ్వింది.